Mukkala Dwarakanath: నెల్లూరు నుంచి అత్తారింటికి హెలికాప్టర్ లో వెళ్లిన కోడలు.. దేవుడా ఈమె రేంజ్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

Mukkala Dwarakanath: ఆడపిల్లపై తండ్రి కి ఉండే ప్రేమ ప్రత్యేకమైనది. ఎంత పేదవాడైనా కూతుర్ని మహారాణిలా చూసుకోవాలనుకుంటాడు తండ్రి. అలాంటిది ఒక రేంజ్ లో స్తోమత కలిగిన తండ్రి తన కూతుర్ని హెలికాప్టర్లో అత్తారింటికి పంపించి వైరల్ అవుతున్నాడు. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. ఏపీలోని నెల్లూరు పట్టణ అభివృద్ధి సంస్థ చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ కుమార్తె ఉషశ్రీని హైదరాబాద్ కు చెందిన ప్రశాంత్ తో వైభవంగా వివాహం జరిపించారు. కనీ వినీ ఎరుగని రీతిలో పెళ్లి చేయించారు.

వివాహం అనంతరం అత్తారింటికి వెళ్లే సమయం వచ్చింది. అయితే తన కూతుర్ని ఆషామాషీగా పంపించకూడదని భావించిన ఆ తండ్రి కూతుర్ని అత్తారింటికి పంపేందుకు హెలికాప్టర్ ని అద్దెకు తీసుకున్నాడు. నెల్లూరు నుంచి విజయవాడకు కూతుర్ని హెలికాప్టర్లో పంపించారు. కాగా హెలికాప్టర్ కోసం ప్రత్యేకంగా హెలిప్యాడ్ తయారు చేయించారు. అది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది. నవ దంపతులు హెలికాప్టర్లో వెళ్లడంపై స్థానికులు చెవులు కొరుక్కుంటున్నారు.

కాదా ద్వారకానాథ్ ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈయన వైయస్ జగన్ కి వీరాభిమాని. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఏకంగా 418 కిలోల వెండితో జగన్ చిత్రపటం రూపొందించి తన ప్రత్యేకత చాటుకున్నాడు. కాగా ఈయనపై నెల్లూరులో అవినీతి ఆరోపణలు చాలా ఉన్నాయి. ఈసారి ఎలా అయినా నెల్లూరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ద్వారకానాథ్ విశ్వప్రయత్నం చేస్తున్నాడు.

హెలికాప్టర్ పై అత్తారింటికి పంపించడం గురించి విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ, అందరూ తను నా కూతురు అనుకుంటున్నారు కానీ తను నా అన్న కూతురు. మాది ఉమ్మడి కుటుంబం. ఆమె చిన్నప్పటినుంచి మాతోనే ఎక్కువగా గడిపేది. చిన్నప్పటినుంచి సరదాగా అత్తారింటికి హెలికాప్టర్లో పోతాను అని మాట్లాడేది. దాన్ని నిజం చేయాలని తలంపుతో ఈ విధంగా చేసాము. ఇది మా స్టేటస్ సింబల్ చూపించుకోవటానికి కాదు, మేము మా బిడ్డ మీద ఉన్న ప్రేమను చూపించుకుంటున్నాము అంతే అని చెప్పకొచ్చాడు ద్వారకానాథ్.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -