Noise Buds VS102+ : బడ్జెట్‌ ధరలోనే లెటెస్ట్‌ ఇయర్‌బడ్స్‌

Noise Buds VS102+ : గతంలో ఫోన్‌ కొనే ముందు ఇయర్‌ ఫోన్, హెడ్‌సెట్‌ బాగుందో లేదో దాని సౌండ్‌ ఎలా ఉంటుందో అని పరిశీలించి కొనేవారు. ప్రస్తుతం ఇయర్‌ ఫోన్‌ ఎవరి దగ్గర కనిపించడం లేదు. అందుకు అందుబాటులోకి వచ్చిన‘ఇయర్‌బడ్స్‌’నే వాడుతున్నారు. అవి కూడా మార్కెట్లో కొత్త కొత్త రకాలుగా వస్తుండటంతో వాటిపై ఆసక్తి కనబరుస్తున్నారు. లేటెస్ట్‌గా నాయిస్‌ నుంచి తక్కువ ధరలో కొత్త డిజైన్‌తో ఇయర్‌బడ్స్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. నాయిస్‌ బడ్స్‌ వీఎస్‌–102 ప్లస్‌బడ్స్‌ లాంచ్‌ అయ్యాయి. ముఖ్యంగా ఫ్లై బర్డ్‌ డిజైన్‌తో కొత్త లుక్స్‌తో ఉన్నాయి. చార్జింగ్‌ కేస్‌తో కలిపి 36 గంటల ప్లేటైమ్‌ ఉంటుంది. మనం అవి పెట్టుకున్నప్పుడు చుట్టు పక్కల నుంచి వచ్చే సౌండ్స్‌తో ఎలాంటి డిస్ట్రబ్‌ లేకుండా అవి పని చేస్తాయి. ఎన్విరాన్‌మెంటల్‌ నాయిస్‌ క్యాన్సలేషన్‌తో ఈ బడ్స్‌ వస్తున్నాయి.

నాయిడ్‌ బడ్స్‌ వీఎస్‌–102 ప్లస్‌ ఇయర్‌బడ్స్‌ ధర రూ.1,199. ఈ–కామర్స్‌ సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌ లో ఆగస్టు 29వ తేదీన ఈ బడ్స్‌ అందుబాటులో ఉండనున్నాయి. ఫారెస్ట్‌ గ్రీన్, జెట్‌ బ్లాక్, స్నో వైట్, స్పేస్‌ బ్లూ కలర్స్‌లో ఉంటాయి. రూ.1,199ను ప్రత్యేక ఇంట్రడక్టరీ ధరగా నాయిస్‌ పేర్కొంది. 11ఎమ్‌ఎమ్‌ సౌండ్‌ డ్రైవర్స్‌తో ఉన్న నాయిస్‌ బడ్స్‌ వీఎస్‌–102 ప్లస్‌ ఇయర్‌బడ్స్‌ ఆడియో ఎక్స్‌పీరియన్స్, బాస్‌ క్వాలిటీ అత్యుత్తమంగా ఉంటుంది. ఫ్లైబర్డ్‌ డిజైన్‌తో ఈ బడ్స్‌ ఓ కొత్త విధంగా ఉన్నాయి.

పరిసరాల నుంచి వివిధ రకాల సౌండ్స్‌ వస్తున్నా కాల్స్‌కు ఇబ్బంది లేకుండా ఎన్విరాన్‌మెంటల్‌ నాయిస్‌ క్యాన్సలేషన్‌ ఫీచర్‌ను నాయిస్‌ ఈ బడ్స్‌కు అందుబాటులోకి తీసుకువచ్చింది. అంతేకకా ఒక్కో బడ్‌కు రెండేసి చొప్పున మైకులు ఉంటాయి. కనెక్టివిటీ కోసం బ్లూటూత్‌ 5.3 వెర్షన్, బ్లూటూత్‌ రేంజ్‌ 10 మీటర్లు ఉంటుంది. చార్జింగ్‌ కేస్‌ మూత ఓపెన్‌ చేయగానే బడ్స్‌ సింక్‌ అయ్యేలా హైపర్‌ సింక్‌ టెక్నాలజీతో ఈ బడ్స్‌ ఉంటాయని సంస్థ పేర్కొంది. చార్జింగ్‌ కేస్‌తో కలిపి 36 గంటల ప్లే బ్యాక్‌ టైమ్‌ ఇస్తాయని నాయిస్‌ వెల్లడించింది. 10 నిమిషాల చార్జింగ్‌తో 120 నిమిషాలు వినియోగించుకోవచ్చు. ఇన్‌స్టాచార్జ్‌ టెక్నాలజీకి కూడా ఈ బడ్స్‌ సపోర్ట్‌ చేస్తాయి. చార్జింగ్‌ కోసం టైప్‌–సీ పోర్ట్‌ ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -