Box Office Review: అక్టోబర్ బాక్సాఫీస్ రివ్యూ.. బాక్సాఫీస్ వద్ద సంచలనలు సృష్టించిన సినిమాల జాబితా ఇదే!

Box Office Review: అక్టోబర్ నెల భగవంత్ కేసరి,లియో, టైగర్ నాగేశ్వరరావు వంటి సినిమాలు రిలీజ్ అవ్వటంతో ప్రేక్షకుల దృష్టి మొత్తం వాటి మీద ఉంది. వీటితోపాటు అక్టోబర్ నెలలో విడుదలైన చాలా సినిమాలు ఏమేమి వచ్చాయో కూడా చాలామందికి తెలియదు. అయితే అక్టోబర్ నెలలో ఈ మూడు సినిమాలతో పాటు చాలా సినిమాలు వచ్చాయి ఇందులో ఏది హిట్టు ఏది ఫట్టు అనే సమాచారం ఇప్పుడు చూద్దాం. నిజానికి అక్టోబర్ నెలలో తెలిసిన హీరోలా సినిమాలు చాలా తక్కువ వచ్చాయి. చిన్న హీరోలు, మనకి తెలియని హీరోల సినిమాలు చాలా వచ్చాయి.

కొందరు ప్రమోషన్స్ తో బాగానే హడావిడి చేశారు అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులను క్రియేట్ చేయలేకపోయారు అక్టోబర్ ఫస్ట్ వీక్ లో కలర్స్ స్వాతి చాలా సంవత్సరాల తర్వాత మంత్ ఆఫ్ మధు అనే సినిమాతో వచ్చింది. అలాగే కిరణ్ అబ్బవరం రూల్స్ నిరంజన్ సినిమాతోనూ, సుధీర్ బాబు మామ మస్చింద్ర సినిమాతోనూ వచ్చాడు. అయితే ఇవేవీ రిలీజ్ అయిన సంగతి కూడా చాలామంది ప్రేక్షకులకు తెలియదు. అలాగే ఈ పోటీలో సిద్ధార్థ కూడా చిన్న అనే సినిమాతో వచ్చాడు అయితే ఇది కూడా పెద్దగా కలెక్షన్స్ ని రాబట్టలేకపోయింది.

అయితే సితార ఎంటర్టైన్మెంట్ కొత్త హీరోలతో మాడ్ అనే సినిమాని తీసింది. ఇది బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించుకుంది. ఇక ముత్తయ్య మురళీధరన్ 800 మూవీ చాలా తక్కువ థియేటర్లలో తెలుగులో విడుదలైంది. ఈ మొత్తం సినిమాలలో మాట్ సినిమా మాత్రమే మంచి కలెక్షన్స్ ని సంపాదించుకుంది. చిన్నా సినిమాకి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి కానీ కలెక్షన్ మాత్రం ఏ మాత్రం రాబట్ట లేకపోయింది. ఇక చాలా సినిమాలకి పెట్టుబడి సగం కూడా వెనక్కి రప్పించుకోలేకపోయారు.

రెండవ వారం నాతోనే నేను, రాక్షస కావ్యం, తంత్రం వంటి సినిమాలు వచ్చాయి, అలాగే గాడ్ సినిమా కూడా తెలుగులో విడుదలైంది ఈ సినిమాలు కూడా పెద్దగా ప్రేక్షకులకి కనెక్ట్ కాలేకపోయాయి. ఇక మూడో వారంలో వచ్చిన భగవంత్ కేసరి దుమ్ము దులిపిన సంగతి అందరికీ తెలిసిందే. లియో పెట్టిన పెట్టుబడికి ప్రాఫిట్స్ తీసుకోగలిగింది కానీ మరొక మూవీ టైగర్ నాగేశ్వరరావు మాత్రం ఈ తాకిడిని అందుకోలేకపోయింది. ఇక నాలుగో వారంలో సంపూర్ణేష్ బాబు మార్టిన్ లూథర్ కింగ్ విడుదలైంది కానీ అంత పెద్దగా ప్రేక్షకులని రంజింప లేకపోయింది.

Related Articles

ట్రేండింగ్

YSRCP: మే ఒకటో తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు.. జగన్ మాయలు మామూలుగా లేవుగా!

YSRCP:  మే 1, బుధవారం ఉదయం గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. తమ ఫోన్స్ కి వస్తున్న మెసేజ్లను చూసి ఏం జరిగిందో తెలియని అయోమయంలో పడ్డారు. అయితే అసలు విషయం...
- Advertisement -
- Advertisement -