Pareshan Boys: ముస్లిం అయినా వినాయకుని మండపం పెట్టిన పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్.. మనమంతా సమానమంటూ?

Pareshan Boys: సాధారణంగా ఇతర దేవులను కొలిచేవారు హిందూ దేవుళ్ళ వద్దకు రారు హిందూ దేవుళ్లను నమస్కరించరు. అలాగే హిందూ దేవుళ్లకు నైవేద్యంగా పెట్టే ప్రసాదాన్ని కూడా వారు తీసుకోరు. ఇలా హిందువులు హిందూ దేవుళ్లను ముస్లిమ్స్ అల్లాను క్రిస్టియన్స్ ఏసుప్రభును కొలుస్తూ ఉంటారు. కానీ మనమంతా ఒకటే అని చాటి చెబుతూ ముస్లిం అయినటువంటి వ్యక్తి వినాయకుడి మండపాన్ని ఏర్పాటు చేసే స్వయంగా వినాయకుడికి పూజలు జరిపించడం విశేషం మరి ఈ పూజలు జరిపించినది ఎవరో కాదు పరేషాన్ బాయ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి ఇమ్రాన్.

పరేషాన్ బాయ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఇమ్రాన్ వినాయకుడి పండుగ సందర్భంగా వినాయక మండపాన్ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పూజ కార్యక్రమాలు అన్నింటిని కూడా దగ్గరుండి జరిపించారు. దీంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రతి ఒక్కరు ఈయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ మా యూట్యూబ్ ఛానల్ లో ఒకరు క్రిస్టియన్ ఒకరు ముస్లిం ఒకరు హిందువు ఉన్నారని మతాలు వేరైనా మనమంతా ఒక్కటి అని చాటి చెప్పడం కోసమే మేము ఇలా ఉన్నామని తెలియజేశారు. వినాయకుడికి మేము పూజలు చేస్తాం కానీ కొబ్బరికాయ మాత్రమే ఇక్కడ కొట్టమని నాకు దేవుడిపై ఎంతో నమ్మకం ఉందని తెలిపారు. గతంలో కూడా వినాయకుడిని పూజించడం వల్ల నాకు మంచే జరిగింది అందుకే ఇప్పుడు కూడా స్వయంగా నేనే నా సొంత డబ్బుతోనే మండపాన్ని ఏర్పాటు చేశానని తెలిపారు.

వినాయకుడి మండపం కోసం దాదాపు 8 లక్షల రూపాయల వరకు ఖర్చు అయిందని ఎవరిని కూడా మేము విరాళాలు అడగలేదని సొంత డబ్బుతోనే ఏర్పాటు చేశానని తెలిపారు. ఇక వచ్చే ఏడాది కూడా ఇలాగే వినాయకుడి మండపాన్ని ఏర్పాటు చేసే విగ్రహ ప్రతిష్ట చేస్తామని ఇమ్రాన్ తెలిపారు ఇక తాను ముస్లిం అయినప్పటికీ హిందూ దేవుళ్లను ఎంతో నమ్ముతాను. తాను శ్రీశైలం కూడా వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటాను అంటూ ఈ సందర్భంగా ఇమ్రాన్ మతాలకు అతీతంగా హిందూ దేవుళ్లను నమస్కరించడంతో ఈయనపై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -