Markapur Bus Accident: యువతి మీద పగబట్టిన మృత్యువు.. ఎలా మృతి చెందిందో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Markapur Bus Accident: మృత్యువు మనపై పగ పడితే ఎక్కడికి వెళ్లినా తప్పించుకోలేము. తప్పనిసరిగా మనం మృత్యు కౌగిలిలో బంధీ కావాల్సిందే అనడానికి ఈ ఘటన చక్కని నిదర్శనం అని చెప్పాలి. వినాయక చవితి పండుగ సందర్భంగా మార్కాపురానికి చెందినటువంటి మానస అనే ఫిజియోథెరపీ విద్యార్థి తన ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులందరితో కలిసి ఎంతో సంతోషంగా వినాయక చవితి పండుగను జరుపుకుంది.

ఎంతో సంతోషంతో పండుగ జరుపుకోవడం కోసం ఇంటికి వచ్చినటువంటి మానస తిరుగు ప్రయాణంలో కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది. ఒకచోట మృత్యువు నుంచి తప్పించుకున్నానని సంతోషపడి బయలుదేరే సమయంలో మరోచోట మృతి ఒకాపు కాచుకొని కూర్చొని తనని తనతో పాటు తీసుకు వెళ్లి పోయింది. మార్కాపురం పట్టణానికి చెందినటువంటి మానస విజయవాడలో ఫిజియోథెరపీ చదువుతుంది అయితే ఈమె తిరుగు ప్రయాణంలో భాగంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసింది.

ఆ బస్సు త్రిపురాంతకం వద్ద అదుపుతప్పి డివైడర్‌ ఎక్కడంతో ప్రయాణీకులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు తగలలేదు అయితే అదే సమయంలో మానస ఉదయమే కాలేజీకి వెళ్లాలన్నా ఆతృతతో గుంటూరు వెళుతున్నటువంటి ఒక ప్రైవేట్ బస్సు ఎక్కారు అయితే అక్కడ మృత్యువు నుంచి తప్పించుకున్నటువంటి మానస ఈసారి మృత్యు కౌగిలిలో బందీ కావాల్సి వచ్చింది.

వేగంగా వెళుతున్నటువంటి ఈ ప్రవేట్ బస్సును ఎదురుగా వస్తున్నటువంటి మరొక లారీ ఢీకొట్టడంతో పెద్ద ఎత్తున ప్రమాదం చోటుచేసుకుంది. ఈ బస్సులో దాదాపు 40 మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉండగా 20 మందికి గాయాలు కావడంతో దగ్గరలోనే ప్రభుత్వాసుపత్రికి తరలించి వారికి చికిత్స అందించారు. అయితే మానస మాత్రం మరణించడంతో ఆమె కుటుంబ సభ్యులు ఎంతో రోదన వ్యక్తం చేస్తున్నారు. మొదటి బస్సు ప్రమాదం జరిగినప్పుడు ఆగిపోయి ఉంటే బ్రతికి ఉండే దానివే కదా అంటూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -