Hawala Money: వాషింగ్ మెషీన్లలో నోట్ల కట్టలు.. వీళ్ల హవాలా మాస్టర్ ప్లాన్ గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే!

Hawala Money: వాషింగ్ మెషిన్లతో ఒక సుజుకి వాహనం విశాఖపట్నంలో బయలుదేరింది అయితే దాని వెనుకగా ఒక వ్యక్తి బైక్ పై వెళ్తున్నాడు. ఇది ఎందుకో పోలీసులకి అనుమానంగా అనిపించింది. వెంటనే వాహనాన్ని ఆపి ఆరా తీస్తే వాషింగ్ మెషిన్లను విజయవాడ తరలిస్తున్నట్లు తెలిపాడు సదరు యువకుడు. అయితే పరిసర ప్రాంతాలకి సరఫరా చేస్తే ఓకే కానీ విశాఖపట్నం నుంచి విజయవాడకి తరలించడం ఏంటి అంటూ మరింత అనుమానం మొదలైంది పోలీసులకి.

వెంటనే వాషింగ్ మిషన్లను తనిఖీ చేశారు పోలీసులు. వాళ్ల ఫ్యూజ్ లు ఎగిరిపోయేలాగా నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. ఈ ఘటన విశాఖపట్నం నడిబొడ్డు ఎన్ఏడి జంక్షన్ లో జరిగింది. విశాఖపట్నం నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులతో వెళుతున్న ఒక ఆటోను ఎన్ఏడి జంక్షన్ వద్ద పోలీసులు తనిఖీ చేశారు. ఆటోలో ఆరు వాషింగ్ మిషన్లు ఉన్నాయి వాటిని తనిఖీ చేయగా అందులో నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. దీంతో పోలీసులు షాక్ అయ్యారు. వాషింగ్ మెషిన్ లో గుట్టల కొద్ది నోట్ల కట్టలు బయటపడటంతోఅన్నింటినీ తనిఖీ చేశారు.

మొత్తం 1.30 కోట్లు విలువచేసే నోట్ల కట్టలు బయటపడ్డాయి. వీటితోపాటు 30 మొబైల్ ఫోన్ కూడా లభించాయి. దీంతో పోలీసులు వాహనాన్ని డబ్బుని మొబైల్ ఫోన్ అని కూడా స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఆటో డ్రైవర్ని ఆరా తీస్తే వాషింగ్ మెషిన్ లని విజయవాడ తీసుకెళ్తున్నానని, అంతేకానీ అందులో డబ్బులు ఉన్న విషయం తనకి తెలియదని చెప్పుకొచ్చాడు.

అయితే నగదుకు సంబంధించిన పత్రాలు గురించి ఎంక్వయిరీ చేస్తుండగా తమకేమీ తెలియదు అంటూ బోరున విలపించాడు ఆ డ్రైవర్. ఇంతలో ఒక ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ నుంచి పోలీసులకి ఫోన్ వచ్చింది ఆ నగదును విజయవాడలోని బ్యాంకులో జమ చేయాల్సి ఉందని అందుకే అందులో తరలిస్తున్నట్లు పోలీసులకి తెలిపారు. అయితే సమాధానం సరిగ్గా లేకపోవడంతో పోలీసులు ఆటోని బైక్ ని సీజ్ చేశారు. వైజాగ్ లో ప్రెసెంట్ ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -