Power Cut Problem: జగన్ రెడ్డి పవర్ అప్పుడే పోతుందిగా.. ఏపీ ప్రజలకు పవర్ కష్టాలు మొదలయ్యాయంటూ?

Power Cut Problem: ఇంకా ఫిబ్రవరి పూర్తి కాకుండానే ఎండలు మండిపోతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాలలో ఎండ తీవ్రత అధికంగా ఉంది 10 గంటల దాటితే బయటకు రావాలి అంటేనే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి నెలలోనే ఇలా ఎండలు మండిపోతుంటే ఇక ఏప్రిల్ మే నెలలో ఎండ తీవ్రత ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు ఇలా ఎండలు మండిపోతున్నటువంటి తరుణంలో మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కోతలు కూడా మొదలయ్యాయి.

ఈ ఏడాది పెద్దగా వర్షాలు లేకపోవడంతో ఎండ తీవ్రత అధికంగా ఉంది. ఇక వర్షాలు లేనందున విద్యుత్ కొరత కూడా భారీ స్థాయిలో ఏర్పడుతుందని తెలుస్తుంది. ఇలా విద్యుత్ కొరత కారణంగా ఇప్పటికే పలు జిల్లాలలో దాదాపు రెండు నించి నాలుగు గంటల వరకు కరెంటు కోతలు విధిస్తున్నారు. ఏప్రిల్ నెలలో ఎన్నికలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో కరెంటును భారీ స్థాయిలో కట్ చేయడంతో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఏర్పడటం జరుగుతుంది.

కోతలు విధించకుండా కరెంటును కొనుగోలు చేయాలన్నా కూడా ఎంతో కష్టతరమైన పనిగా ఉందని చెప్పాలి. ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా కరెంటు కష్టాలు మొదలవడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన పట్ల కూడా ప్రజలు తీవ్రస్థాయిలో విసుగు వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎన్నికల ముందు కరెంటు కోతలు భారీగా విధిస్తున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డికి ఈ పవర్ కట్ ఇబ్బందికరంగానే మారుతుందని చెప్పాలి.

అసలే ఒకవైపు ఎండలు మండిపోతున్నాయి దీనికి తోడు కరెంటు లేదు ఇలాంటి సమయంలోనే ఎన్నికలు కూడా వస్తున్నటువంటి తరుణంలో కాక మీద ఉన్నటువంటి ప్రజలు జగన్మోహన్ రెడ్డి పవర్ కట్ చేస్తారని చెప్పాలి. ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు పవర్ చార్జీలన్నీ తగ్గించేస్తానని పెద్ద పెద్ద బిల్డప్ ల ఇచ్చి.. ఐదేళ్లలో ఎనిమిది సార్లు రేట్లు పెంచారు. బిల్లులు రెట్టింపు చేశారు. ఇప్పుడు చాన్స్ వస్తే ఊరుకుంటారా అసలు ఊరుకోరు జగన్మోహన్ రెడ్డినీ గద్దె దించడానికి ఇది కూడా ప్రధాన కారణంగా మారుతుందని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -