Pravallika Suicide: ప్రవళ్లిక సూసైడ్ కేసులో ఊహించని ట్విస్టులు.. ఆమె మరణం వెనుక ఇన్ని కోణాలా?

Pravallika Suicide: హైదరాబాదులో జరిగిన ప్రవళిక ఆత్మహత్య వ్యవహారంలో బిగ్ ట్విస్ట్ ఇది. గ్రూప్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆమె పరీక్షలు వాయిదా పడటంతో ఆందోళనలతో ఆత్మహత్య చేసుకుంది అంటూ గవర్నమెంట్ ని తెగ తిట్టిపోశారు మీడియా వాళ్ళు. అయితే ఆమె అసలు గ్రూప్ 2 పరీక్షకు దరఖాస్తే చేయలేదు, 15 రోజులు క్రితమే ఆమె వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చి హాస్టల్లో చేరింది గ్రూప్స్ కి ప్రిపేర్ అవ్వటానికి వచ్చింది.

వాయిదా పడిన గ్రూప్ టు పరీక్షతో ఆమెకు అసలు సంబంధం లేదు, ఆ పరీక్షకు ఆమె ప్రిపేర్ కావడం లేదు. అంటే ఆ పరీక్ష వాయిదా పడటం వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుంది అనేది పూర్తిగా అబద్ధం. దాంతో విద్యా కుసుమం రాలిపోయింది, ప్రభుత్వం చంపేసింది అంటూ రాద్ధాంతం చేసిన వారందరూ షాక్ లో ఉండిపోయారు. ప్రవళిక ఆత్మహత్యకు అసలు కారణం ప్రేమ వ్యవహారం. శివరాం రాథోడ్ అనే అబ్బాయిని ఆమె ప్రేమించింది.

వారిద్దరూ చనిపోయిన రోజు ఉదయం కూడా కలిసి టిఫిన్ చేశారు. ఆ సీసీ ఫుటేజ్ కూడా పోలీసులకు దొరికింది. అయితే శివరాం వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకోవడంతో ఆ లవ్ స్టోరీ ఫెయిల్ అయింది ప్రేమలో విఫలమైన ప్రవల్లిక జీవితం పై విరక్తితో ఆత్మహత్య చేసుకుంది. అసలు జరిగింది ఇది, అయితే గ్రూప్ పరీక్షలు వాయిదా పడటంతో ఆందోళనలో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అంటూ సోషల్ మీడియా తెగ ఊదరగొట్టింది.

ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు తెలుసు అని అనుమాన పడుతున్నారు పోలీసులు అయితే ఆమె చనిపోవడంతో విషయాన్ని బయట పెట్టలేదు. రోడ్లు మీదకు వచ్చి ఆందోళనలు చేసిన స్వార్ధ ప్రయోజనాల కోసం ప్రభుత్వంపై విమర్శలు చేసిన కూతురు మీద ప్రేమతో ఆమె ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టలేదు ఆమె తల్లిదండ్రులు. అయితే ఫోన్లో వాళ్ళ చాటింగ్ ని గుర్తించారు పోలీసులు. ప్రవళిక రాసిన సూసైడ్ లెటర్ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన శివరాం, ప్రవళికల వీడియోలను సేకరించి నిజాన్ని బయటపెట్టారు సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -