Mahesh-Jawan: జవాన్ మూవీకి మహేష్ బాబు రివ్యూ.. ఆ విషయంలో ఎవరూ మ్యాచ్ చేయలేరంటూ?

Mahesh-Jawan: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ గురించి మనందరికీ తెలిసిందే. ఈయన బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. బాలీవుడ్ లో దాదాపుగా నాలుగు దశాబ్దాలుగా హీరోగా రాణిస్తూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే పఠాన్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన షారుఖ్ ఖాన్ అదే ఊపుతో జవాన్ సినిమాలో కూడా నటించారు. తాజాగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.

బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. దీంతో మరో బ్లాక్ బస్టర్ హిట్స్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు షారుక్ ఖాన్. పఠాన్ సినిమా విడుదల అయ్యే దాదాపుగా 900 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా విడుదలైన జవాన్ సినిమా కూడా ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది. జవాన్ సినిమా మంచి సక్సెస్ ని సాధించడంతో ప్రేక్షకులు, అభిమానులు, పెద్ద ఎత్తున ఈ సినిమాపై స్పందిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా పై స్పందించారు.

ఈ మేరకు ట్విట్టర్లో ఒక ట్వీట్ కూడా చేశారు. ఆ ట్వీట్ లో ఈ విధంగా రాసుకు వచ్చారు మహేష్ బాబు.. జవాన్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా. కింగ్ తో డైరెక్టర్ అట్లీ కింగ్ సైజ్ ఎంటర్టైన్మెంట్ ను అందించారు. ఇది అతడి కెరియర్ లో బెస్ట్ ఫిలిం అని చెప్పవచ్చు. ఈ సినిమాలో షారుక్ ఖాన్, ఆరా, చరిష్మా స్క్రీన్ ప్రజెన్స్ ని ఎవరు మ్యాచ్ చేయలేరు. ఆయన చెలరేగిపోయాడు. ఈ సినిమాతో షారుక్ ఖాన్ గత సినిమాల రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం. అని రాసుకు వచ్చారు మహేష్ బాబు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -