Surrogacy row: సరోగసి విషయంలో భారీ ట్విస్ట్.. నయనతారకు చర్యలు తప్పవా?

Surrogacy row: దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే గత పది రోజుల నుంచి నయనతార విగ్నేష్ దంపతులు పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఈ దంపతులు పెళ్లయిన నాలుగు నెలలకే తల్లిదండ్రులయ్యామని ప్రకటించడంతో అసలు సమస్య వచ్చి పడింది.నయనతార విగ్నేష్ గత ఏడు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నప్పటికీ ఈ ఏడాది జూన్ నెలలో వివాహం చేసుకున్నారు.

ఈ విధంగా జూన్ నెలలో వివాహం చేసుకున్న ఈ దంపతులు అక్టోబర్ 9వ తేదీ పిల్లలకు కవల పిల్లలకు జన్మనిచ్చామంటూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు. అయితే సరోగసి విషయంలో వీరు నిబంధనలను ఉల్లంఘించారనే విషయంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఈ విషయంపై ఏకంగా తమిళనాడు ప్రభుత్వం కూడా స్పందించింది.

చట్ట ప్రకారం మనదేశంలో సరోగసి విధానంలో పిల్లలకు జన్మనివ్వలంటే వివాహం జరిగి ఐదు సంవత్సరాలయి ఉండాలి లేదా ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటేనే సరోగసి ద్వారా తల్లిదండ్రులు కావచ్చు అయితే నయనతార ఈ నిబంధనలను పాటించారా అనే విషయంపై తీవ్రస్థాయిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపోతే నయనతార విగ్నేష్ ఆరు సంవత్సరాల క్రితమే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారని షాక్ ఇచ్చారు.

ఇలా ఆరు సంవత్సరాల క్రితం వివాహం చేసుకోవడంతో సరో గెట్ ద్వారా పిల్లలను కనడానికి వీరు అర్హులు. ఇక వీరికి అద్దెకు గర్వం ఇచ్చిన మహిళ ఆధారాలను కూడా ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుందని తమిళనాడు వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది.అయితే తమిళనాడు ప్రభుత్వం నయనతార దంపతులకు నోటీసులు జారీ చేసినప్పటికీ ఇంకా వీరు తమ పెళ్లి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అలాగే సరోగేట్ మదర్ కు సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి సమర్పించలేదట.

ఈ విధంగా ప్రభుత్వం హెచ్చరించినప్పటికీ నయనతార దంపతులు ఈ విషయంపై స్పందించకపోవడంతో ఈ సరోగసి విషయంలో ప్రభుత్వంలోతుగా విచారణ జరపాలని భావించినట్టు తెలుస్తుంది. నేరుగా నయనతార ఇంటికి వెళ్లి త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. విచారణకు నయనతార దంపతుల సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది ఈ లోగా నయనతార దంపతులు ఆధారాలను సేకరించి ప్రభుత్వానికి సమర్పిస్తే శిక్ష నుంచి బయటపడతారని లేకపోతే ఈ దంపతులకిఎట్టి పరిస్థితులలోనూ శిక్ష నుంచి తప్పించుకునే అవకాశాలు కూడా ఉండవని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -