Ayodhya Temple: 500 ఏళ్ళ పోరాటానికి ఫలితం రామ మందిరం.. నిర్మాణంలో ఉన్న మందిరం దృశ్యాలివే!

Ayodhya Temple: అయోధ్య రామ మందిరం నిర్మాణం.. ఇది కోట్లాది మంది హిందువుల కల అన్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఈ రామ మందిరం ని చూడడానికి ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఈ రామ మందిరం నిర్మాణం వెనుక ఎన్నో అవాంతరాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. వాటన్నింటిని దాటుకొని ఎట్టకేలకు 2024 జనవరిలో ఈ రామాలయం ప్రారంభం కాబోతోంది.

ఇంకా రామ మందిరం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ రామ మందిరం 500 సంవత్సరాల పోరాటం సంకల్ప ఫలితమని చెబుతూ శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రానికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు.

అయోధ్యలోని రామమందిర నిర్మాణం పూర్తవుతున్న నేపథ్యంలో యాత్రికులు రామయ్య విగ్రహాన్ని దర్శించుకోగలరని అయోధ్య రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి ఆలయ నిర్మాణం పూర్తవుతుంది. అయితే ఆలయ ప్రాణ ప్రతిష్ట తేదీ ఇంకా ఖరారు కాలేదని ఆయన తెలిపారు.

జనవరి 26, 2024లోపు యాత్రికులు రాముడిని బలరాముడిగా దర్శించుకోగలరని మిశ్రా చెప్పారు. ఆలయాన్ని 12 గంటల పాటు తెరిచి ఉంచితే 70,000 నుంచి 75,000 మంది సులభంగా దర్శనం చేసుకోవచ్చని మిశ్రా తెలిపారు. ఆలయ నిర్మాణానికి ప్రజల నుంచి డబ్బులు, వస్తువులు విరాళాలుగా వస్తున్నాయని రామాలయం నిర్మాణంలో ప్రభుత్వ ప్రమేయం లేదని పేర్కొన్నారు.

అంతేకాకుండా రామాలయ నిర్మాణానికి విరాళాల ద్వారా సుమారు రూ.3,500 కోట్లు సేకరించినట్లు ఆయన తెలిపారు. అయోధ్య వివాదంపై 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం అయింది.

సుప్రీంకోర్టు తీర్పు తర్వాత, అయోధ్యలో అద్భుతమైన రామ మందిర నిర్మాణానికి సంబంధించి అన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కేంద్రం శ్రీరామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 5, 2020న రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -