Gurram Yadagiri Reddy: 15 ఏళ్లు ఎమ్మెల్యే.. సొంతిల్లు లేదు.. ఈ ఎమ్మెల్యే గొప్పదనం తెలిస్తే మాత్రం గ్రేట్ అనాల్సిందే!

Gurram Yadagiri Reddy: రాజకీయాలలో కనుక ఎమ్మెల్యే గాను ఎంపీగాను పోటీ చేస్తే పెద్ద మొత్తంలో రాజకీయ నాయకులు ఆస్తులు సంపాదించుకుంటారు అనే విషయం మనకు తెలిసిందే ఇలా ఎంతోమంది ఇప్పటికే రాజకీయాలలో కొనసాగుతూ కొన్ని వేలకోట్లకు అధిపతి అయ్యారు. అయితే 15 ఏళ్లుగా ఎమ్మెల్యే కొనసాగిన ఒక ఎమ్మెల్యేకు మాత్రం ఇప్పటికీ ఉండడానికి సొంత ఇల్లు లేదు అనే విషయం తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. మరి 15 ఏళ్లుగా ప్రజాసేవ చేసినటువంటి ఆ నాయకుడు ఎవరు అనే విషయానికి వస్తే…

నల్గొండ జిల్లా స్థల గ్రామానికి చెందిన యాదగిరి రెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందారు ఇలా ఈయన రాజకీయాలలో ప్రజలకు ఎన్నో సేవలు చేశారు అనే సంగతి తెలిసిందే ఇలా దాదాపు 15 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి ఈయనకు తన స్వగ్రామంలో అప్పట్లో నిర్మించిన ఇల్లు మూడు ఎకరాల పొలం మాత్రమే ఉంది. ఈయన రాజకీయాల పరంగా తిరిగి హైదరాబాద్లో స్థిరపడ్డారు అయితే ఇప్పటికి తనకు హైదరాబాదులో సొంత ఇల్లు లేకపోవడం గమనార్హం.

ఎమ్మెల్యేగా కొనసాగుతూ ప్రజాసేవ చేస్తూ ప్రజల కోసం ఎంతో తాపత్రయపడినటువంటి ఈయన తన క్షేమం కోసం తన సౌకర్యం కోసం ఎప్పుడూ ఆలోచించలేదు అందుకే ఎలాంటి అవినీతి లేకుండా ప్రజలకు చేయాల్సిన సేవలన్ని కూడా చేశారు. ఇక యాదగిరి రెడ్డి ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అంటే ఆయనకంటూ సొంత వాహనాలు లేవు. ఇప్పటికీ ఈయన ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేస్తారని తెలుస్తోంది.

ఇలారాజకీయాలలో కొనసాగుతున్నటువంటి ఈయన ఎలాంటి హంగు ఆర్భాటాలకు పోకుండా మొదటి నుంచి కూడా ఒక సామాన్య వ్యక్తీ లాగా బ్రతుకుతూ వచ్చారు అలాగే కేరళలోకి వచ్చిన మొదటి నుంచి కూడా ఈయన కమ్యూనిస్టు సిద్ధాంతాలను ఆచరిస్తూ ముందుకు సాగుతున్నారు.

తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించినటువంటి యాదగిరి రెడ్డి దళంలో పనిచేసినందుకుగాను ఇవ్వాల్సిన పెన్షన్ కూడా అందుకోవడం లేదు. ఏది ఏమైనా రాజకీయాలలో కూడా ఇలాంటి వారు ఉంటారా అంటూ ఈయన గురించి తెలిసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -