Thopudurthi Prakash Reddy: తోపుదుర్తి కకృత్తితో వైసీపీ పరువు గంగలో.. అయ్యో పాపం అనాల్సి వస్తోందిగా!

Thopudurthi Prakash Reddy: అనంతపురం జిల్లా రాప్తాడు ఎన్నో సంవత్సరాలుగా పరిటాల ఫ్యామిలీ నీడలో అభివృద్ధి చెందుతూ వస్తుంది. నిజానికి పరిటాల ఫ్యామిలీకి కంచుకోట రాప్తాడు. అలాంటి రాప్తాడు ఇప్పుడు అధికార దాహానికి బలై అభివృద్ధి కోసం ఎదురు చూస్తూ ఉంది. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి దీన గాధలకి కరిగిపోయిన జనం పాతిక వేల ఓట్ల తేడాతో ఆయనని గెలిపించింది. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ప్రకాష్ రెడ్డి ప్రజల సేవ కోసం కాకుండా కేవలం ధన సంపాదన కోసమే ఈ ఐదు సంవత్సరాలు వినియోగించారు.

ఒకప్పుడు అప్పుల పాలయ్యాము, ఈసారి ఓడిపోతే ఆత్మహత్య దిక్కు అంటూ దీనంగా వేడుకున్న ప్రకాష్ రెడ్డి ఇప్పుడు 1000 కోట్లకు మించిన ఆస్తిని కలిగి ఉన్నాడు. ఆయన సొంత లాభాల కోసం రాప్తాడు ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టేసాడు. అందుకు ఉదాహరణగా అంతర్జాతీయ బ్రాండ్ జాకీ కంపెనీ రాప్తాడులో పరిశ్రమ పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటే కేవలం తనకి కమిషన్ ఇవ్వలేదని ఆ పరిశ్రమని రాప్తాడు కి దూరం చేశారు. రాప్తాడు ప్రజల ఉజ్వల భవిష్యత్తుకు గండి కొట్టారు. ఇది శాంపిల్ మాత్రమే ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.

దీనిపై స్వయంగా ప్రకాష్ రెడ్డి ఒక సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గం కోసం తాను ఎంతో చేయాలనుకున్నాను కానీ ఏమీ చేయలేకపోయాను అందుకు చాలా అసంతృప్తిగా ఉంది అని చెప్పారు. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినప్పటికీ 100 రోజులలో రాప్తాడు నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని, రోడ్ల నిర్మాణం పూర్తి చేసిన తరువాతే ఎన్నికలకు వెళ్తామని హామీ ఇచ్చారు.

అయితే రోడ్లు వేయటం పక్కన పెడితే కనీసం మట్టిని కూడా తోలించలేకపోయారు ప్రకాష్ రెడ్డి. ఆ అసంతృప్తి ప్రజలలో బాగా కనిపిస్తుంది. అయితే పరిటాల సునీత అధికారంలో ఉన్నప్పుడు రాప్తాడు లో లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ గా ఉండేది. ప్రకాష్ రెడ్డి మీద అసంతృప్తితో రగిలిపోతున్న సునీత వైపు మొగ్గు చూపిస్తున్నారు. జనసేనతో పొత్తు కూడా తమకు ప్లస్ అవుతుందని టీడీపీ శ్రేణులు ధీమాతో ఉన్నాయి. ప్రస్తుతం ప్రకాష్ రెడ్డి పరిస్థితి చూస్తే అయ్యో పాపం అనాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -