Bichagadu 2: బిచ్చగాడు2 మూవీకి అవే మైనస్.. ఆ సీన్లు అస్సలు బాలేవా?

Bichagadu 2: విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన దర్శకత్వం వహించిన తాజా చిత్రం బిచ్చగాడు 2. కాగా ఈ సినిమా బిచ్చగాడు వన్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. బిచ్చగాడు పార్ట్ వన్ సినిమా 2016 లో విడుదల అయింది. విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై అతడే నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా నేడు థియేటర్ లలో విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాలో కావ్య తాపర్ హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ సినిమాలో కథ ఏంటి అన్న విషయానికి వస్తే..

విజయ్ గురుమూర్తి దేశంలో రిచెస్ట్ మ్యాన్ అని ఒక పేరు. లక్షల కోట్లకు వారసుడైన విజయ గురుమూర్తి పై చాలామంది కళ్ళు ఉంటాయి. అయితే అనుకోకుండా విజయ్ గురుమూర్తి చనిపోవడంతో, విజయ గురుమూర్తి పోలికలతో ఉన్న మరో అతని పోలీసులు అరెస్టు చేస్తారు. ఉన్నట్టుండి ఆ వ్యక్తి విజయ్ గురుమూర్తి లాగా మాట్లాడడం ఆలోచించడం చేస్తాడు. అయితే అసలు విజయ్ గురుమూర్తిని పోలిన వ్యక్తి ఎవరు? చివరికి ఏం జరుగుతుంది అన్నది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. తాజాగా విడుదల అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ గా స్పందన లభిస్తోంది.

 

బిచ్చగాడు పార్ట్ వన్ కంటే పార్ట్ 2 నే అద్భుతంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమాలోని సెంటిమెంట్ సన్నివేశారు హృదయానికి హత్తుకునే విధంగా ఉన్నాయట. మొత్తంగా ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. కానీ సినిమాలో సాగదీత ఎక్కువగా ఉందని తెలుస్తోంది. అదే ఈ సినిమాకు పెద్ద మైనస్ పాయింట్ అని తెలుస్తోంది. ప్లస్ పాయింట్ విషయానికొస్తే ఈ సినిమాలో కథ మధ్య మధ్యలో కొన్ని సన్నివేశాలు నటీనటుల యాక్షన్ ఇవన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయని తెలుస్తోంది. మొత్తానికి విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ గానే స్పందన లభిస్తోంది..

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -