Deaf Lawyer Sara Sunny: సైగలతో సుప్రీం కోర్టులో వాదనలు వినిపించిన లాయర్.. ఈమె టాలెంట్ కు ఫిదా కావాల్సిందే!

Deaf Lawyer Sara Sunny: బదిరులు మూగవారికి ఎంత టాలెంట్ ఉన్నా వారికి సమాజంలో ఎదిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే ఒక స్త్రీ తన వైకల్యాన్ని పక్కనపెట్టి అరుదైన ఘనత సాధించింది. అదేమిటంటే ఒక మూగ చెవిటి మహిళ తన ప్రతిభ తో సుప్రీంకోర్టులో సైగలతో వాదనలు వినిపించి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే కేరళ రాష్ట్రంలోని కొట్టాయం కు చెందిన సారా సన్నీ జన్యులోపం వల్ల మాట్లాడు లేరు. ఆమె సోదరి, సోదరుడు సైతం జన్యులోపాల వల్లే ఇదే సమస్యని ఎదుర్కొన్నారు.

అయితే సారా తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలని ప్రయోజకులను చేయాలని భావించారు. సారా చిన్నప్పటినుంచి అల్లరి అమ్మాయి, మాట్లాడలేకపోయినా కూడా బాగా మాట్లాడేదని, ఎంతమంది మధ్యలో ఉన్న తన తప్పు లేనప్పుడు సైగలతోనే ప్రశ్నించే గుణాన్ని అలవర్చుకుందని చెప్పారు. సారా సోదరి తండ్రి బాటలో చార్టర్డ్ అకౌంటెంట్ చదివితే సారా మాత్రం లాయర్ వృత్తి ని ఎంచుకున్నారు.సెయింట్ జోసెఫ్ లా కాలేజీలో సారా సన్నీ చదివారు.

తాను లాయర్ కావాలని ఎందుకు అనుకున్నాను అనే ప్రశ్నకి సారా సైగలతో సమాధానం చెప్తూ నాలా వైకల్యం ఉన్నవారికి ఉదాహరణగా నిలవాలని ఆలోచనతో ఈ రంగాన్ని ఎంచుకున్నాను అని అన్నారు. కర్ణాటక బార్ కౌన్సిల్లో పేరు నమోదు చేయించుకున్న సారా తాను న్యాయవాద వృత్తి చేపట్టిన తొలి బదిరురాలు అని తెలుసుకొని ఆశ్చర్యపోయాను అన్నారు. ఈమె సెంటర్ ఫర్ లా అండ్ పాలసీ రీసెర్చ్ తో పాటు ప్రముఖ సంస్థల్లో ఇంటర్న్ గాను ఢిల్లీకి చెందిన నేషనల్ హ్యూమన్ రైట్స్ నెట్వర్క్ లో సభ్యురాలుగాను ఉంది.

ఈమె ప్రస్తుతం తిరు అండ్ తిరు అసోసియేట్స్ లో పనిచేస్తూ సుప్రీంకోర్టు న్యాయవాదిని సంచిత ఐన్ వద్ద జూనియర్గా వ్యవహరిస్తోంది. తాజాగా సుప్రీం కోర్ట్ లో వర్చువల్ గా జరిగిన ఒక కేసు విచారణలో తన వాదనలను సంకేత భాషలో సైన్ లాంగ్వేజ్ వ్యాఖ్యాత సౌరవ్ రాయ్ చౌదరి ద్వారా తన వాదన వినిపించి అందరి ప్రశంసలు పొందిన సారా వైకల్యం శరీరానికే కానీ సాధించాలని తన సంకల్పానికి కాదు అని నిరూపించారు. ఏమైనా ఈమెకు హాట్సాఫ్ చెప్పాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -