Uday Bhanu Daughters: ఉదయభాను పిల్లలు జనగణమన ఎలా పాడారో చూడండి.. వాళ్లను ప్రతిభను మెచ్చుకోవాల్సిందే!

Uday Bhanu Daughters: ఉదయభాను.. తెలుగు వెండితెర బుల్లితెర ప్రేక్షకులకు ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు యాంకర్ గా ఒక వెలుగు వెలిగిన ఉదయభాను ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ యాంకర్ ఎవరు అంటే సుమ కనకాల పేరు వినిపిస్తోంది. కానీ ఒకప్పుడు మాత్రం నెంబర్ వన్ యాంకర్ అంటే ఉదయభాను వేరే వినిపించేది. షోలు, ఈవెంట్లు,ఆడియో లాంచ్ ఈవెంట్లు ఇలా ఏ ఒక్కటి విడిచిపెట్టకుండా అన్నింటిలోనూ తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకుల మెప్పిస్తూ వచ్చింది.

అంతేకాకుండా ఈమె ఎంతో మంది ఫిమేల్ యాంకర్లకు ఆదర్శంగా కూడా నిలిచింది. ఇకపోతే ఉదయభాను తన పర్సనల్ అసిస్టెంట్ విజయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత చాలా కాలానికి ఉదయభానుకు ట్విన్స్ ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. దాంతో అప్పటి నుంచి ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైంది. పిల్లల ఆలనా పాలన వారి బాధలు చూసుకుంటూ ఇంటికి పరిమితమైంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పిల్లలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఉదయభాను పిల్లలకు సంబంధించిన ఒక వీడియో చక్కర్లు కొడుతోంది.

 

ఆగస్టు 15 సందర్భంగా ఉదయభాను పిల్లలు ఇద్దరు కూడా జాతీయ గీతాన్ని ఎంతో చక్కగా అనుభవించారు. ఇద్దరు కలిసి ఎంతో అద్భుతంగా జాతీయ గీతాన్ని పాడారు.. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పిల్లలు ఎంతో ముద్దుగా పాడారు చాలా చక్కగా ఉన్నారు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు..

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -