Udaybhanu Children: ఉదయభాను పిల్లలు జనగణమన ఎలా పాడారో చూడండి.. వాళ్లను ప్రతిభను మెచ్చుకోవాల్సిందే!

Udaybhanu Children: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ ఉదయభాను గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు యాంకర్ గా ఒక వెలుగు వెలిగింది ఉదయభాను. అప్పట్లో ఈమె ఎన్నో షోలకు, ఈవెంట్ లకు యాంకర్ గా వ్యవహరించింది. అంతేకాకుండా కొన్నేళ్ల పాటు సినిమా ఇండస్ట్రీలో యాంకర్ గా ఒక వెలుగు వెలిగింది. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల టీవీ షోలకు కార్యక్రమాలకు దూరం అయిన విషయం తెలిసిందే. కాగా ఉదయభాను కేవలం యాంకర్ గా మాత్రమే కాకుండా హీరోయిన్ గా కూడా పలు సినిమాల్లో నటించింది.

ఆ తరువాత సినిమాలకు దూరం అయిన ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై తన సత్తాను నిరూపించుకుంది. అప్పట్లో ఏ షోలో చూసినా కూడా ఆమె కనిపించేది. ఇకపోతే ఉదయభాను కు ఇద్దరు ఆడపిల్లలు ఆ ఇద్దరూ కూడా కవల పిల్లలు అన్న విషయం తెలిసిందే. పెళ్లి అయిన తర్వాత ఇద్దరు కవ‌ల పిల్లలకు జన్మనిచ్చింది. అప్పట్నించి బుల్లితెరకు, సినిమాలకు దూరంగా ఉంటోంది. ఇటీవల కాలంలో ఉదయభాను తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడంతో పాటు తన పిల్లలకు సంబంధించిన ఫోటోలను వీడియోలను పంచుకుంటూ ఉంటుంది.

 

ఇది ఇలా ఉంటే తాజాగా ఆగ‌స్ట్ 15న ఇండిపెండెన్స్ డే సంద‌ర్భంగా ఆమె పిల్ల‌లు జ‌న‌గ‌ణ‌మ‌న జాతీయ గీతాన్ని అద్భుతంగా ఆల‌పించిన వీడియో వైరల్ గా మారింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ వీడియోని చూసిన అభిమానులు పిల్లలు చాలా చక్కగా పాడారు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించిన ఉదయభాను యాంకర్ గా అలాగే సినిమాలలో నటించడానికి సిద్ధంగా ఉన్నారు..

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -