Chidambaram Temple: శివుడిని నమ్ముకుంటే ఎప్పటికీ ఓడిపోడు.. ఈ విషయాలు తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

Chidambaram Temple: సృష్టిలో ప్రతి ప్రాణికి పంచభూతాలే జీవనాధారం. అంతటా శివుడు నిండి ఉంటాడు. జలం, తేజం, వాయువు ఆకాశం అన్నీ ఆయనే. పంచభూతాత్మక స్వరూపుడైన పరమశివుడు లింగస్వరూపుడిగా ఐదు క్షేత్రాలలో వెలిశాడు. ఇందులో పృధ్వీ లింగం కంచిలోను, ఆకాశ లింగం చిదంబరంలోనూ, జల లింగం జంబుకేశ్వరంలోనూ, అగ్నిలింగం అరుణాచలంలోనూ, వాయు లింగం శ్రీకాళహస్తిలోనూ ఉన్నాయి. వీటిలో నాలుగు ఆలయాలు తమిళనాడులో ఉంటే ఒకటి మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఉంది.

అదో పెద్ద చిదంబర రహస్యం అని అంటూ ఉంటాం కదా ఈ చిదంబరం అనే మాట ఆ క్షేత్రం నుంచి వచ్చిందే. చెప్పలేని, తెలుసుకోలేని విషయాల గురించి ప్రస్తావిస్తూ ఈ చిదంబర రహస్యం అనే మాటని వాడుతారు. అయితే మహా పరమేశ్వరుడిని మోక్షం సాధించాలి అంటే ఏం చేయాలి అందరికీ మంచి పనులు చేయాలని ఆలోచన ఉండదు కదా అని కొందరు అడిగారంట. అప్పుడు మహా పరమేశ్వరుడు ఇలా చెప్పాడంట. చిదంబరంలో నా దర్శనం ఎలా చేసుకుంటారో..

అలా చేసుకోండి చాలు మోక్షం ఇచ్చేస్తాను అని. అంటే ఈ చిదంబరంలో శివ దర్శనం ఎలా ఉంటుందంటే గర్భాలయంలో వెనుక భాగంలో ఒక చక్రం ఉంటుంది. దానికి ముందు భాగంలో బంగారం బిల్వపత్రాలు వేలాడుతూ కనిపిస్తాయి. అయితే వీటిని భక్తులకు కనిపించకుండా అడ్డుగా ఉంచుతారు. అక్కడ పూజారులు ప్రత్యేకమైన సందర్భాలలో మాత్రమే భక్తులకు ఆ తెరను తీసేసి భక్తులకు చూపిస్తారు. ఈ ప్రదేశాన్ని శివోహం భవ అంటారు.

శివ అంటే దైవం, అహం అంటే మనం. మన మనసు దైవంలో ఐక్యమయ్యే ప్రదేశమని అర్థం. ఏ రూపము లేకుండా అజ్ఞానాన్ని తొలగించుకుంటూ దైవ సన్నిధి అనుభూతి చెందడమే ఈ పుణ్యక్షేత్రం ప్రాశస్త్యం, అదే చిదంబర రహస్యమని పండితులు చెప్తారు. శివుడిని నమ్ముకున్నాడు ఎప్పటికీ ఓడిపోడు అనే భావన చిదంబరం ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి కచ్చితంగా కలుగుతుంది. ఎవరైతే ఈ గుడిలో నటరాజస్వామి దర్శనం చేసుకుని బయటకు వచ్చి వెనక్కి తిరిగి చూస్తే ఈ దేవాలయానికి సంబంధించిన గోపురం మన వీపు వెనకే వస్తున్న అనుభూతి కలుగుతుంది. కాబట్టి చిదంబరం నటరాజస్వామి దర్శనం అంత ప్రశస్తమైనది.

Related Articles

ట్రేండింగ్

YSR Cheyutha Scheme: డబ్బులన్నావ్.. డబ్బాలు కొట్టుకున్నావ్.. చేయూత నాలుగో విడత జమయ్యాయా జగన్?

YSR Cheyutha Scheme: జగన్మోహన్ రెడ్డి ఇటీవల తన ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన సంగతి తెలిసిందే .ఈ మేనిఫెస్టోలో భాగంగా ఈయన గత ఐదు సంవత్సరాల కాలంలో ఏ సామాజిక వర్గానికి...
- Advertisement -
- Advertisement -