Janasena Glass Symbol: పవన్ ఫ్యాన్స్.. ఊపిరి పీల్చుకోండి.. జనసేన పార్టీ గుర్తు విషయంలో టెన్షన్ లేనట్టేనా?

Janasena Glass Symbol:వచ్చే ఎన్నికలలో ఎలాగైనా జనసేన పార్టీకి డిపాజిట్లు కూడా రాకుండా చేయాలని అధికార వైసిపి పార్టీ ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసింది. అయితే ఈ కుట్రలు కూతంత్రాలకు ఈసీ చెక్ పెట్టిందని చెప్పాలి. ముఖ్యంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించడానికి ఇప్పటికే పెద్ద ఎత్తున వైసిపి నేతలు అక్కడ మొహరించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఇక్కడ పవన్ కళ్యాణ్ ని ఓడించే దిశగా ఇండిపెండెంట్గా పవన్ కళ్యాణ్ అనే పేరుతో అభ్యర్థులను పోటీకి దింపి వారి గుర్తు కూడా అచ్చం గాజు గ్లాస్ గుర్తు లాగే ఉండేలా జాగ్రత్త పడ్డారు.

ఈ విధంగా పవన్ కళ్యాణ్ కి గాజు గ్లాసును పోలే ఉన్నటువంటి గుర్తులతో ఎన్నికల బరిలోకి దిగితే చాలామంది కన్ఫ్యూజన్ అయి ఓట్లు చీల్చే ప్రయత్నం చేసిన తమకు లాభదాయకంగా ఉంటుందని వైసిపి చాలా చీప్ ట్రిక్స్ ప్లాన్ చేశారు .అయితే ఈ విషయంపై ఈసీ పునరాలోచన చేసి సంచలన నిర్ణయం తీసుకుంది. గాజు గ్లాసు కేవలం జనసేన పార్టీ గుర్తుగా మాత్రమే గుర్తించారు. జనసేన అభ్యర్థులు పోటీ చేసే చోట గాజు గ్లాస్ గుర్తు ఉంటుందని మిగిలిన చోట ఇండిపెండెంట్ అభ్యర్థులు పోటీ చేసిన గాజు గ్లాస్ గుర్తు ఉండదని తెలిపారు.

ఇలా ఈసీ తమ నిర్ణయాన్ని తెలపడంతో ఒక్కసారిగా వైసిపి నేతలలో ఆందోళన మొదలైంది.ఇలా ఈసీ తీసుకున్నటువంటి నిర్ణయంతో పవన్ కళ్యాణ్ అలాగే జనసేన అభిమానులు కార్యకర్తలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలలో ఎలాగైనా ఓటమి తప్పదని భావించినటువంటి వైసీపీ ఎలాగైనా కూటమిని ఓడించడానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లాన్ చేస్తున్నారని చెప్పాలి.

ఇకపోతే ఇప్పటికే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమైందనే చెప్పాలి. లక్ష మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలుస్తారని అక్కడ ప్రజలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలా గెలుపు ఖాయం కావడంతోనే వైసిపి నేతలు కుట్రలకు తెర లేపుతున్నప్పటికీ ఎప్పటికప్పుడు కూటమి వాటిని తిప్పికొడుతూ వస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -