Covid-19: కరోనాతో మంచాన పడ్డవాళ్లకు మరో షాకింగ్ న్యూస్.. అలాంటి ప్రమాదం పొంచి ఉందా?

Covid-19: 2020లో కరోనా ప్రపంచాన్ని ఎంతగా ఒణికించిందో అందరికీ తెలిసిందే. ఆ భయానక చావులు తలుచుకుంటే ఇప్పటికీ ఒంట్లో ఒణుకు పుడుతుంది. కరోనా మిగిల్చిన చేదు జ్ఞాపకాలకి ఇప్పటికీ చాలా కుటుంబాలు కోలుకోలేకపోతున్నాయి. అప్పట్లో కరోనాతో ఇబ్బంది పడి కోలుకున్న వాళ్ళు ఇప్పటికీ బాధపడుతున్నారు. అయితే అలాంటి వాళ్ళకి మరొక చేదు వార్త ఒకటి లాన్సెట్ రీజినల్ హెల్త్ యూరప్ జర్నల్ వినిపించింది.

అసలు విషయం ఏమిటంటే కరోనా రోగుల్లో వారం పాటు లేదా అంతకన్నా ఎక్కువ కాలం మంచానికి పరిమితమైన వారిలో లాంగ్ కోవిడ్ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. వీరిలో చాలామంది రెండు ఏళ్లపాటు విపరీతమైన ఒంటినొప్పులు తదితర లక్షణాలతో బాధపడుతున్నారు. లింగ బేధం, వయోభేదం లేకుండా అందరిలోనూ ఈ లక్షణాలు సమానంగా కనిపిస్తున్నాయి.

ఈ అధ్యయనం కోసం స్వీడన్, నార్వే, డెన్మార్క్, ఐస్లాండ్ లో 64,880 మంది వయోజనులను ఎంచుకున్నారు. వీరందరూ కరోనా సంబంధిత సమస్యలతో బాధపడిన వారే, అందరూ ప్రత్యక్షంగానో,పరోక్షంగానో కరోనా టీకాలు వేయించుకున్న వారే. వీరిలో 22 వేల మందికి పైగా కరోనాకాలం లో బాధపడ్డారు. వీరిలో చాలామంది ఏడు రోజులు అంతకంటే ఎక్కువ రోజులు మంచాన్ని పడ్డవారే. వీరు శ్వాస ఆడక పోవడం, చాతి నొప్పి, తల తిప్పడం, తలనొప్పి వంటి తీవ్ర లక్షణాలతో బాధపడిన వారే.

ప్రపంచ ఆరోగ్య సంస్థల నిర్వచనం ప్రకారం మూడు నెలల తర్వాత దాని తాలూకా లక్షణాలు తిరగబెట్టి కనీసం రెండు నెలలు ఆపైన కొనసాగితే దానిని లాంగ్ కోవిడ్ గా పేర్కొంటున్నారు. లాంగ్ కోవిడ్ ప్రజారోగ్యానికి పెద్ద సమస్యగా మారింది. అంతర్జాతీయంగా ఎంతో మంది దీని బారిన పడ్డారు. కాబట్టి కరోనా బారిన పడ్డవారు ఎలాంటి చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా అశ్రద్ధ చేయకుండా తమ మీద తాము తగినంత శ్రద్ధ తీసుకొని వీలైనంత మటుకు వైద్యుని పర్యవేక్షణలో ఉండడం చాలా అవసరం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -