Rahu Kalam: రాహుకాలం రోజు అస్సలు చెయ్యకూడని పనులు ఇవే.. ఈ తప్పులు చేస్తే మాత్రం పాపమంటూ?

Rahu Kalam: మామూలుగా ఏదైనా శుభకార్యం మొదలు పెట్టినప్పుడు అలాగే ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు రాహుకాలం వచ్చేస్తుంది తొందరగా వెళ్ళాలి అని అంటూ ఉంటారు. రాహుకాలం రాకముందే పని మొదలు పెట్టాలని పండితులు ఇంట్లోని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇంతకీ రాహుకాలం అంటే ఏమిటి రాహుకాలంలో మంచి పనులు చేయకూడదా. ఈ విషయాల గురించి మనం తెలుసుకుందాం.. రాహుకాలంని చెడు సమయంగా భావిస్తారు. కాబట్టి ఆ సమయంలో చేసిన పనులు జరగమని చెబుతూ ఉంటారు.

అందుకే రాహుకాలంలో ప్రయాణం చేయకూడదంటారు. వ్యాపారం వంటివి మొదలు పెట్టకూడదంటారు. కొత్త పనులను కూడా రాహుకాలంలో మొదలుపెట్టరు. పెళ్లిళ్లు వంటివి కూడా రాహుకాలంలో చెయ్యరు. శాస్త్రం ప్రకారం చూసినట్లయితే శుభకార్యాలు ఏమైనా చేయాలంటే శుభముహూర్తంలోనే చేస్తారు. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు కాలాన్ని మొత్తం ఎనిమిది భాగాలుగా విభజించారు. ఇందులో ఒకటి రాహుకాలం. అయితే ఈ రాహుకాలం అనేది ప్రాంతాన్ని బట్టి మారిపోతుంది. సుమారు ఈ రాహుకాలం 90 నిమిషాల నుండి గంటన్నర వరకు ఉంటుంది. ప్రతిరోజూ ఇది ఒకలా ఉండదు. సమయాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది.

సోమవారం పూట రెండో భాగంలో, శనివారం నాడు మూడో భాగంలో, శుక్రవారం నాడు నాలుగో భాగంలో, బుధవారం ఐదో భాగం, గురువారం ఆరో భాగం, మంగళవారం అయితే ఏడవ భాగం, ఆదివారం 8వ భాగంలో వస్తుంది. రాహుకాలంలో ఎలాంటి శుభకార్యాలు కూడా చెయ్యరు. రాహుకాలంని చెడు సంకేతంగా భావిస్తారు. రాహువు సూర్యుడిని మింగే పాము. అందుకని చెడు సంకేతంగా దీన్ని పరిగణిస్తారు. రాహుకాలంలో రాహువు ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

రాహుకాలంలో విలువైన వస్తువుల్ని కొనుగోలు చేయకూడదు అలాగే ప్రయాణాలు కూడా చేయకూడదు. అంతేకాకుండా ఇల్లు అమ్మడం, కొనడం, బంగారు ఆభరణాలను కొనడం, ఇంటి గృహప్రవేశం వంటివి చేయకూడదు. కొత్త పనులు మొదలు పెట్టకూడదు. పెళ్లి, నిశ్చితార్థం వంటి వేడుకలని కూడా చేయకూడదు. కానీ కాలసర్ప దోషం ఉన్న వాళ్ళకి రాహుకాలమే మంచి ఫలితం ఇస్తుందట. అందుకే పండితులు పెద్దలు ఎప్పుడూ కూడా రాహుకాలంలో ఎటువంటి పనులు చేయకూడదు బయలుదేరి వెళ్లకూడదు అని చెబుతుంటారు.

Related Articles

ట్రేండింగ్

CM YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ ఫెయిల్డ్ ముఖ్యమంత్రా.. హామీల అమలులో అట్టర్ ఫ్లాప్?

CM YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల కాలంలో ఏపీ అభివృద్ధిని గాలికి వదిలేసారన్నమాట వాస్తవమే. ఇలా అభివృద్ధిని పక్కనపెట్టి ఎంతసేపు తెలుగుదేశం పార్టీ నాయకులు అధినేత...
- Advertisement -
- Advertisement -