Indigo Flight: ఇండిగో విమానంలో ఇలాంటి పరిస్థితా.. ఏసీ బంద్ చేసి టిష్యూలు ఇవ్వడంతో?

Indigo Flight: ప్రముఖ విమానయాన సమస్థ ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. చండీగఢ్ నుంచి జైపూర్ ప్రయాణిస్తున్నటువంటి ఇండిగో విమానం ఏసీ ఆన్ కాకుండానే గాలిలోకి ఎగరడంతో ప్రయాణికులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడ్డారు. ఇక ఈ విమానం జైపూర్ చేరుకునే వరకు ఏసి ఆన్ కాకపోవడంతో ప్రయాణికులు దాదాపు 90 నిమిషాల పాటు నరకం అనుభవించారని తెలుస్తోంది.

ఈ విధంగా ఇండిగో ప్రయాణికులు ఎదుర్కొన్నటువంటి ఈ ఇబ్బందులను పంజాబ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజావారింగ్ శనివారం ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.ఈ విమానంలో ప్రయాణించే ప్రయాణికులు అందరూ దాదాపు 15 నిమిషాల పాటు ఎండలో నిలబడి విమానంలోకి వచ్చారు అయితే ఏసీ ఆన్ కాకుండానే ఈ విమానం టేక్ ఆఫ్ అయింది.

 

ఇలా విమానం టేక్ ఆఫ్ అయినప్పటికీ ఏసీ ఆన్ కాకపోవడంతో ఉక్కపోతతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. కొందరు ఉపసమనం కోసం పేపర్లతో గాలి వీసుకుంటూ ఉండగా ఎయిర్ హోస్టెస్ మాత్రం చెమటను తుడుచుకోవడానికి అందరికీ టిష్యూలను అందజేశారు. ఇలా 90 నిమిషాల పాటు ప్రయాణికులు నరకయాతన అనుభవించారనే చెప్పాలి.

 

ఇక ఈ ఘటనకు సంబంధించిన ఈ వీడియోని పౌర విమానాల సర్వీసుల నియంత్రణ సంస్థ డీజీసీఏకు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకిటైప్ చేస్తూ ఇండిగో ఎయిర్లైన్స్ కి సంబంధించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ అమరేందర్ కోరారు. ఏది ఏమైనా 90 నిమిషాల పాటు ఉక్కపోతుతో ప్రయాణం చేయాలి అంటే ఎంతో ఇబ్బంది అని చెప్పాలి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -