Ghee Lamps: దీపాన్ని నూనెకు బదులుగా నెయ్యితో వెలిగిస్తే పుణ్యం లభిస్తుందా.. ఏం జరిగిందంటే?

Ghee Lamps: హిందువులు మామూలుగా ప్రతిరోజూ నిత్య దీపారాధన చేస్తూ ఉంటారు. అయితే దీపారాధన చేస్తున్నప్పటికీ చాలామందికి అనేక రకాల సందేహాలు నెలకొంటూ ఉంటాయి. ఏ నూనెతో దీపారాధన చేయాలి? ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అంటూ ఇలా అనేక రకాల సందేహాలు ఇస్తూ ఉంటాయి. మరి దీపానికి నూనె కు బదులుగా నెయ్యిని వెలిగిస్తే పుణ్యం లభిస్తుందా ఈ విషయంపై ప్రముఖులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నెయ్యి చాలా పవిత్రమైనది.

కాబట్టి అటువంటి వస్తువులతో పూజించడం వల్ల హృదయం, మనసు, పర్యావరణం కూడా శుద్ధి అవుతుంది. ఆవు పాల నుండి నెయ్యిను తయారు చేస్తారు. అది ఎంతో స్వచ్ఛమైనది. అలాగే నెయ్యి మంచి సువాసనని కలిగి ఉంటుంది. పూజ స్థలంపై ఇది మంచి ప్రభావం చూపిస్తుంది. మన శరీరంలో ఏడు చక్రాలు ఉంటాయి. నెయ్యి వలన వాటిలో శక్తి ప్రవహిస్తుంది. కాబట్టి నూనెతో కంటే నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే మంచిది. నేతితో దీపాన్ని వెలిగిస్తే వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. ఆవు పాలతో చేసిన నెయ్యితో దీపాన్ని వెలిగించినట్లయితే ఇంట్లోకి క్రిములు ప్రవేశించవు.

అందుకే పూజలో నెయ్యిని వాడతారు. నెయ్యితో ప్రార్థన స్థలంలో దీపం వెలిగిస్తే చాలా ప్రశాంతత వస్తుంది. అంతేకాకుండా నెయ్యితో దీపాన్ని వెలిగించడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. నెయ్యిని పంచామృత స్వరూపంగా కూడా భావిస్తారు. అందుకే నేతితో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదని పండితులు అంటుంటారు..

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -