Subhashree: బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన శుభశ్రీ రెమ్యునరేషన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

Subhashree: బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ కార్యక్రమం ఎంతో ఘనంగా ప్రారంభమైన విషయం మనకు తెలిసిందే .ఈ కార్యక్రమం సెప్టెంబర్ మూడవ తేదీ ప్రారంభమై ఇప్పటికే ఐదు వారాలను పూర్తిచేసుకుంది 14 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమంలో ఐదు మంది కంటెస్టెంట్ లో ఎలిమినేట్ అయ్యారు. ఇక ఆదివారం మరొక ఐదు మంది కంటెస్టెంట్లు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

ఇక ఐదవ వారంలో భాగంగా బిగ్ బాస్ నుంచి లేడీ కంటెస్టెంట్ శుభశ్రీ ఎలిమినేట్ అయిన విషయం మనకు తెలిసిందే. ఐదు వారాలపాటు హౌస్ లో కొనసాగుతూ తన స్టైల్ లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసినటువంటి శుభ శ్రీ ఐదవ వారం ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ ఎపిసోడ్ ప్రారంభంలోనే నాగార్జున తనని హౌస్ నుంచి బయటకు పంపించేశారు ఇలా హౌస్ నుంచి బయటకు వచ్చినటువంటి శుభశ్రీ ఐదు వారాలపాటు హౌస్ లో కొనసాగినందుకు ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నారు అనే విషయం గురించి చర్చలు మొదలయ్యాయి.

ఇలా బిగ్ బాస్ హౌస్ లో 5 వారాల పాటు కొనసాగుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం కోసం బిగ్ బాస్ ఈమెకు భారీగానే రెమ్యూనరేషన్ అందించినట్టు తెలుస్తుంది. ఈమెకు వారానికి రెండు లక్షల రూపాయలు చొప్పున 5 వారాలకు గాను 10 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చారని తెలుస్తోంది. ఇలా ఐదు వారాలకే 10 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదు అని చెప్పాలి.

వారానికి రెండు లక్షల రూపాయలు అందుకున్నటువంటి ఈమె కాస్త టాస్కులపై కూడా ఫోకస్ చేసే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసి ఉంటే మరికొన్ని వారాలపాటు హౌస్ లో కొనసాగి ఉండేదని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా బిగ్ బాస్ కార్యక్రమం నుంచి ఐదు వారాలు పాటు వరుసగా అమ్మాయిలను బయటకు పంపించడం పట్ల బిగ్ బాస్ నిర్వాహకులపై కూడా విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -