Sun Transit: ఆ నక్షత్రంలోకి సూర్య భగవానుడు.. ఇకపై ఆ రాశుల వాళ్లకు అంతా మంచే జరగనుందా?

Sun Transit: గ్రహాలకి రాజు అయిన సూర్య భగవానుడు పుష్య నక్షత్రంలోకి ప్రవేశించాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారు విశేష ప్రయోజనాలను పొందుతారు. ఆ రాశులు ఏమిటో ఇప్పుడు చూద్దాం. వేద,జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలు 27 నక్షత్రాలు మరియు రాశులలోకి ప్రవేశిస్తాయి. సూర్యుడు జూలై 20, 2023 సాయంత్రం పుష్య నక్షత్రం లోకి ప్రవేశించాడు. ఈ పుష్య నక్షత్రం 27 నక్షత్రాలలో ఎనిమిదవది బృహస్పతి మరియు శనిచే పాలించబడుతుంది.

ఈ రాశిలో చాలా రాశి చక్ర గుర్తులు ఉన్నాయి. అయితే సూర్యుడు పుష్య నక్షత్రం లోకి ప్రవేశించడం వలన 4 రాశులు వారు లాభపడతారు. ముందుగా మేషం. ఈ రాశిలో సూర్యుడు పుష్య నక్షత్రంలో నాలుగవ ఇంట్లో ఉంటాడు. అటువంటి పరిస్థితి లో ఈ రాశి వారికి సూర్యునితోపాటు బృహస్పతి యొక్క ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. దాని వలన ఇంట్లో ప్రశాంతత, గృహ సమస్యలనుంచి ఉపశమనం పొందడం ఆగిపోయిన పనులు ప్రారంభం అవడం.

 

అలాగే సమాజంలో గౌరవం కూడా పెరగటం వంటి లాభాలు సమకూరుతాయి. తర్వాత మిధున రాశి పుష్య నక్షత్ర గోచారం రెండవ ఇంట్లో ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో రాసి చక్రం యొక్క స్థానికులు వారి కష్టానికి పూర్తి ఫలాలను పొందవచ్చు. వీరికి వ్యాపారంలో పెట్టుబడులు ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురు కావచ్చు కానీ మీరు మాత్రమే విజయం సాధించగలరు. అలాగే కర్కాటక రాశిలో సూర్యుడు పుష్య నక్షత్రంలో నక్షత్రంలో సంచరించిన తర్వాత మొదటి ఇంట్లో ఉంటాడు.

ఇటువంటి పరిస్థితులలో కర్కాటక రాశి వారికి ప్రభుత్వ రాజకీయ నాయకులు లాభపడే అవకాశం ఉంటుంది. దానికి కారణంగా మీరు పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వ్యక్తులు విజయం సాధిస్తారు. ఇక నాలుగవది అయినా ధనస్సులో సూర్యుడు ఎనిమిదవ ఇంట్లో ఉంటాడు. ఇటువంటి స్థితిలో ఈ రాశి కి చెందిన వ్యక్తులు ఆర్థిక స్థితి బలపడుతుంది. అనవసర ఖర్చులు కూడా అరికట్టబడతాయి స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో ఎక్కడికైనా వెళ్లేందుకు ప్రణాళికలు వేసుకోవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -