Tathastu Devathalu: తథాస్తు దేవతలు దీవించే సమయం ఇదే.. ఆ సమయంలో ఈ తప్పులు మాత్రం చేయొద్దంటూ?

 Tathastu Devathalu:పురాణాల ప్రకారం మనం సంధ్య సమయంలో కానీ లేదా ఇతర సమయాలలో కానీ ఏదైనా అనరాని మాటలు అంటే కనుక మన పెద్ద వాళ్ళు మనల్ని తిడతారు అలా అనద్దు పైన తథాస్తు దేవతలు ఉంటారు. ఇలా చెడుగా మాట్లాడితే నిజంగానే జరుగుతాయి అంటూ మనల్ని తిడుతూ ఉంటారు అయితే నిజంగానే ఈ తథాస్తు దేవతలు ఉన్నారా.. అసలు ఈ దేవతలు ఉన్నారా అన్న సందేహం కలుగుతుంది మరి ఈ విషయం గురించి పూర్తిగా ఇక్కడ తెలుసుకుందాం…

పురాణాల ప్రకారం సూర్యదేవుడు సంధ్య అనే మహిళను వివాహం చేసుకుంటారు అయితే సూర్యుని తేజస్సు భరించలేనటువంటి సంధ్య ఒక గుర్రం రూపంలోకి మారి గురుదేశానికి వెళుతుంది. అయితే తన భార్య ఇలా గుర్రంగా మారినది గ్రహించినటువంటి సూర్య దేవుడు కూడా గుర్రంలా మారి అక్కడికి వెళ్తారు. ఇలా గురుదేశంలో వీరిద్దరూ కలయిక ద్వారా జన్మించిన వారే అశ్విని దేవతలు.

ఈ అశ్విని దేవతలు బంగారు రథంలో వెళ్తూ ఉంటారు వీరు వెళ్లే మార్గం గుండా తధాస్తు అంటూ వెళ్తూ ఉంటారు. అయితే ఈ అశ్విని దేవతలు ఎక్కువగా యజ్ఞాలు చేసే చోట అలాగే పూజ కార్యక్రమాలు చేస్తూ మంత్రోచ్ఛరణ జరుగుతున్నటువంటి చోట తిరుగుతూ ఉంటారు. ఇక సంధ్యా సమయంలో కూడా అశ్విని దేవతలు తిరుగుతూ ఉంటారు. ఇలా అశ్విని దేవతలను తథాస్తు దేవతలు అంటారు. అందుకే సంధ్యా సమయంలో మనం పొరపాటున కూడా ఇతరుల నాశనం గురించి మాట్లాడకూడదు.

ఇతరుల పట్ల చెడుగా మాట్లాడకూడదు పొరపాటున ఒకరు నాశనం కావాలని కోరుకోకూడదు ఇలా కోరుకోవడం వల్ల అదే సమయంలో అటుగా ప్రయాణిస్తున్నటువంటి తథాస్తు దేవతలు వింటే తథాస్తు అనడం వల్ల నిజంగానే మనం అన్నవి జరుగుతాయని పెద్దలు చెబుతుంటారు. అందుకే సంధ్యా సమయంలోను పూజా కార్యక్రమాలు యజ్ఞాలు చేసే చోట ఎప్పుడూ కూడా పొరపాటున కూడా ఇతరుల నాశనాన్ని కోరుకోకూడదు అలాగే తప్పు పనులను కూడా చేయకూడదు.

Related Articles

ట్రేండింగ్

Jagan- Pawan, Sharmila: ఆ జిల్లాలో ఒకేరోజు జగన్, షర్మిల, పవన్ కళ్యాణ్.. ప్రచారంతో మెప్పించేదెవరో?

Jagan- Pawan, Sharmila: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడంతో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను మొదలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీ నాయకులు జనాలలోనే ఉంటూ పార్టీ ప్రచార కార్యక్రమాలను...
- Advertisement -
- Advertisement -