Telangana IAS Officer: భార్య వేధింపుల గురించి ఫిర్యాదు చేసిన తెలంగాణ ఐఏఎస్.. విధి విచిత్రం అంటే ఇదేనేమో?

Telangana IAS Officer: కొన్ని కొన్ని సంఘటనలు చూస్తుంటే సమాజం ఎటువైపు వెళుతుంది అనే బాధ కలుగుతుంది. సాధారణంగా గృహహింస కేసులు ఆడవాళ్లు పెడతారు. అయితే ఇప్పుడు ఒక ఉన్నత అధికారి తన భార్యపై ఇలాంటి కేసు పెట్టడం ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే బీహార్ కి చెందిన సందీప్ కుమార్ ఝా.. తెలంగాణ క్యాడర్లో ఐఏఎస్ అధికారులుగా పని చేస్తున్నారు.

ఆయనకి 2021 నవంబర్ 21వ తేదీన పల్లవి ఝా తో వివాహం జరిగింది. అయితే పెళ్లి తర్వాత బంజారాహిల్స్ లో ఆయన నివాసంలో 25 రోజులు మాత్రమే భార్యతో కలిసి ఉన్నారు అనంతరం భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తలేత్తాయి అవి చిలికి చిలికి గాలి వాన లాగా మారి పెద్ద గొడవలు కి దారితీసాయి దాంతో భార్యాభర్తలు ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు.

 

అయినప్పటికీ తన భార్య తనతో తరచూ గొడవ పడేదని.. ఆమె సోదరుడు తన ఇంట్లో 25000 దొంగలించినట్లుగా, తన పేరిట ఉన్న ఆస్తులను భార్య పేరిట బదిలీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు సందీప్ కుమార్ ఝా. మరోవైపు తప్పుడు ఆరోపణలతో తనపై బీహార్లో కేసులు నమోదు చేశారని వాపోయారు. సంతూర్ లోని తన ఇంటిపై దాడి చేసి కుటుంబ సభ్యులను గాయపరిచి వారిని బెదిరించినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు.

 

తనపై తప్పుడు ఆరోపణలతో తన భార్య బావమరిది మామ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత అధికారులకు మెయిల్ ద్వారా ఫిర్యాదులు చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా సందీప్ కుమార్ ఝా బంజారాహిల్స్ పోలీసులకి ఫిర్యాదు చేశారు సందీప్ కుమార్ ఝా. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసుని దర్యాప్తు చేస్తున్నారు. ఒక ఉన్నత స్థానానికి చెందిన అధికారి కూడా భార్య బాధితుడు కావడం చూసి విధి విచిత్రం అంటే ఇదేనేమో అంటూ నోరెళ్ళబెడుతున్నారు సదరు భర్తలు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -