Banglore: ప్రేయసి పుట్టినరోజున షాకిచ్చిన ప్రియుడు.. అలా చేయడంతో?

Banglore: ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా కూడా ప్రేమ పేరుతో మోసాలు జరుగుతున్నాయి. అమ్మాయిలు ఒక అబ్బాయిని ప్రేమిస్తూనే అబ్బాయికి తెలియకుండా మరో అబ్బాయిని ప్రేమిస్తూ ట్రయాంగిల్ లవ్ స్టోరీలు నడిపిస్తున్నారు. చాలావరకు ఎక్కువగా అమ్మాయిలే ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు. తీరా అసలు విషయం బయటపడేసరికి ఒకరినొకరు నిందించుకోవడం చంపడం వరకు వెళ్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కూడా ఒక ప్రియుడు ప్రియురాలి బాగోతం బయట పడేసరికి కోపంతో ఊగిపోయి ఆ తర్వాత ఊహించని దారుణానికి పాల్పడ్డాడు.

అసలేం జరిగిందంటే.. ఈ ఘటన బెంగళూరులోని రాజగోపాలనగర పరిధిలో చోటు చేసుకుంది. హోమ్ శాఖ ఆఫీసులో క్లర్క్‌గా పని చేస్తున్న నవ్య అని 24 ఏళ్ల యువతి రామనగర జిల్లా కనకపుర తాలూకా తామసంద్రకు చెందినవారు. కానీ కోరమంగళలో నివాసం ఉంటూ ఉద్యోగం చేసేది. నవ్య ఒకే ఊరు, దూరపు బంధువు అయిన ప్రశాంత్‌ బెంగళూరు లగ్గేరి రాజేశ్‌నగరలో ఉంటూ, పీణ్యలో ఫ్యాక్టరీలో ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. వీరిద్దరూ గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా నవ్య పుట్టిన రోజు సందర్బంగా పార్టీ చేసుకుందామని ప్రశాంత్‌ ఆమెను తన రూమ్ కి పిలిచాడు.

ఇద్దరు రూమ్ కి చేరుకున్న తర్వాత మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కేక్ కట్ చేశారు. తర్వాత నవ్య మొబైల్ లో చాటింగ్ చేయడం చూసిన ప్రశాంత్ అనుమానంతో నవ్య అని ప్రశ్నించాడు. దాంతో ప్రేమికుల ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. దాంతో కోపంతో ఊగిపోయిన ప్రశాంత్ కేక్ కోసం కత్తితోనే నవ్య గొంతు కోసేసాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఇక ఆమె చనిపోవడంతో ఏమి చేయాలో దిక్కుతోచగా ఆమె శరీర భాగాలను కత్తిరించి గోని సంచిలో పెట్టి దూరంగా పడేయాలి అనుకున్నాడు.

కానీ అది కుదరకపోవడంతో గదిలోనే శవంతో పాటు సాయంత్రం వరకు ఉన్నాడు. ఆ తర్వాత ఊహించని నిర్ణయం తీసుకున్న ప్రశాంత్ నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్ కి వెళ్లి జరిగిందంతా పోలీసులకు వివరించి లొంగిపోయాడు. వెంటనే పోలీసులు నవ్య తల్లి నాగరత్నకు ఫోన్ చేసి పిలిపించారు. అనంతరం ప్రశాంత్ ను అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ఇక కూతురి మరణ వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు గుండెలు విలిసేలా రోదిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP: వైసీపీ వాళ్ల ముఖాలు చూస్తే ఓటమి అర్థమవుతోందా.. సర్వేలతో సైతం పని లేదుగా!

YSRCP: ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఏ పార్టీకి అనుకూలంగా ఉందనే విషయం గురించి పెద్ద ఎత్తున సర్వేలు నిర్వహించారు. ఇలా లోకల్ సంస్థల నుంచి మొదలుకొని నేషనల్ చానల్స్ కూడా...
- Advertisement -
- Advertisement -