Avalahalli Baba: పూజల పేరుతో యువతిపై నకిలీ బాబా అత్యాచారం.. వీడియో తీయించి బెదిరింపులు!

Avalahalli Baba: ఇప్పటికీ వెలుగులోకి ఎంతో మంది నకిలీ బాబాలు బయటపడ్డారు. ఏదో ఒక చోట అమాయక ప్రజలను మూఢనమ్మకాల పేరుతో మోసం చేస్తున్నారు. అయినా కూడా ఈ తరం ప్రజలు ఇప్పటికి వీటికి లొంగిపోతూనే ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా మరో నకిలీ బాబా బయటపడ్డాడు. అంతే కాకుండా పూజల పేరుతో ఒక పెళ్లి కానీ యువతిని ఐదేళ్లుగా అత్యాచారం చేసి మోసం చేశాడు.

ఇంతకూ అసలు విషయం ఏంటో.. బెంగళూరు సమీపంలో ఆవలహళ్లి అనే ప్రాంతంలో ఓ కుటుంబం నివసిస్తుంది. అయితే ఆ కుటుంబంలోని ఉన్న ఓ యువతికి ఎన్ని సంబంధాలు చూసిన పెళ్లి కాకపోవటంతో ఆనందమూర్తి అనే బాబా దగ్గరికి వెళ్లారు. దీంతో ఆ బాబా వారి అమాయకత్వాన్ని తెలుసుకొని వారికి రోజు పూజలు పేరుతో పూజలు ప్రారంభించాడు.

అతడు పూజలు చేసే క్రమంలో ఇచ్చే పానీయాలలో మత్తుమందు కలిపి ఆ యువతిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఆ నకిలీ బాబా ఆనందమూర్తి తన భార్య లతతో ఫోన్ లో తను చేస్తున్న అత్యాచార వీడియోలను తీయించి ప్రతి సారి ఆ వీడియోలతో ఆ యువతిని బెదిరిస్తూ దాదాపు ఐదేళ్లుగా తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

దీంతో ఆ యువతి చేసేదేమీ లేక లాయర్ జ్ఞానేష్ తో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటికే తన కుటుంబం నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేశారు అని.. వచ్చే పెళ్లి సంబంధాలను ఆ భార్యాభర్తలు ఇద్దరు చెడగొడుతున్నారు అని.. ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే ఆ వీడియోలను ఇంటర్నెట్లో పెడతామని బెదిరిస్తున్నారు అని వాపోయింది. అంతేకాకుండా ఆ నకిలీ బాబా ఆమెను తనతోనే ఉండాలని.. తన లక్కీ బేబీని అన్నాడని తెలిపింది. దీంతో పోలీసులు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -