CM Jagan: జగన్ మేనిఫెస్టో మోసాలు.. శవాల మీద పేలాలు ఏరుకునేలా రాజకీయాలు చేశారా?

CM Jagan:  జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో తనకు బైబిల్ ఖురాన్ భగవద్గీత లాంటిది అని చెబుతూ ఉంటారు అయితే ఎన్నికలలో భాగంగా మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఎన్నో పథకాలను అమలు పరచలేదు అయితే ఇలాంటి పథకాలు కూడా చెప్పారా అన్న సందేహాలు కూడా వ్యక్తమౌతూ ఉంటాయి చంద్రబాబు నాయుడు హయామంలో చంద్రన్న బీమా పథకం ఉండేది.

ఈ పథకం ద్వారా ఎవరైనా ప్రమాదవశాత్తు మరణించిన సహజంగా మరణించిన వారికి పది రూపాయల బీమాతో సహజ మరణానికి 30000 ప్రమాదవశాత్తు మరణిస్తే లక్ష రూపాయల బీమా అందించేవారు. ఇలా చనిపోయిన తర్వాత కూడా ఆ కుటుంబం ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని అమలులోకి తీసుకువచ్చారు పేదల ఇళ్లలో పెళ్లితో పాటు చావు కూడా ఖర్చుతో కూడుకున్నదే అని తెలిసిన బాబు ఈ పథకాన్ని అమలు చేశారు.

ఇక ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనే విషయం తెలిస్తే కనుక ఈ బీమా కింద వెంటనే వారి ఇంటికి వెళ్లి ఖర్చులకు డబ్బులు ఇవ్వడమే కాకుండా ఆ తర్వాత భీమా డబ్బులను వారి అకౌంట్లో జమ చేసేవారు. ఈ పథకానికి ప్రజలలో మంచి ఆదరణ ఉందని తెలిసినటువంటి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టోలో కూడా జీవన బీమా పేరుతో ఓ పథకం ప్రకటించారు. 18 నుంచి 60 సంవత్సరాల ఏ పౌరుడైనా సహజంగా మరణిస్తే వైఎస్ఆర్ జీవన బీమా పథకం ద్వారా రూ. లక్ష అందిస్తామని ప్రకటించారు.

అయితే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇలాంటి పథకం ఒకటి ఉందని బహుశా రాష్ట్రవ్యాప్తంగా ఏ ఒక్కరికి కూడా తెలియదని చెప్పాలి. ఎందుకంటే కేవలం ఓట్ల కోసమే జగన్మోహన్ రెడ్డి ఈ విధమైనటువంటి అబద్ధపు మేనిఫెస్టోలను ప్రకటించి ఆ ఊసే లేకుండా చేశారు. ఇటీవల పెన్షన్లు అందక ఎంతో మంది వృద్ధులు చనిపోతే వారికి ఈ భీమా పథకం ఉందని చెప్పిన సందర్భాలు ఎక్కడా లేవు అంతేకాకుండా ఆ వృద్ధుల శవాలతో కూడా రాజకీయాలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి మాత్రమే చెల్లుతుందని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -