Place on Moon: అమ్మ ప్రేమకు బహుమతిగా చంద్రుడిపై స్థలం కొన్న కూతురు.. ఏం జరిగిందంటే?

Place on Moon: తాజాగా పెద్దపల్లికి చెందిన ఓ మహిళ తన తల్లి మీద ఉన్న ప్రేమతో చంద్రుడిపై స్థల కొనుగోలు చేసి గిఫ్ట్‌గా అందించారు. గోదావరిఖని జీఎం కాలనీకి చెందిన సింగరేణి ఉద్యోగి సుద్దాల రాంచంద్ర, వకుళాదేవి దంపతుల పెద్ద కుమార్తె సాయి విజ్ఞత తల్లి వకుళాదేవి పేరు మీద చంద్రుడిపై 2022లో లూనార్ రిజిస్ట్రేషన్ ద్వారా దరఖాస్తు చేసుకుంది. అయితే ఆగస్టు 23న వకుళాదేవి, ఆమె మనువరాలు ఆర్త సుద్దాల పేర్ల మీద చంద్రుడిపై ఫ్లాట్‌ రిజిస్ట్రేషన్‌ అయ్యింది. కాగా సాయి విజ్ఞత అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలో గవర్నర్ కిమ్ రెనాల్డ్స్ వద్ద ప్రాజెక్ట్ మేనేజర్‌, ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా పనిచేస్తున్నారు.

అయితే ఇకపై చంద్రుడి మీద భూమిని కొనుగోలు చేయాలి అనుకునే వారు లూనార్ రిజిస్ట్రీ అనే వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. ఈ వెబ్‌ సైట్‌ను సందర్శించి, భూమిని కొనుగోలు చేయాలనుకుంటున్న ప్రాంతాన్ని ముందుగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో సీ ఆఫ్ ట్రాంక్విలిటీ, లేక్ ఆఫ్ డ్రీమ్స్ సహా పలు ప్రాంతాలు ఉంటాయి. ముందుగా మీకు నచ్చిన ప్రాంతాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత కొనుగోలుకు సంబంధించిన డాక్యుమెంట్లను పొందాలి. అయితే చంద్రుడిపై ఎకరానికి రూ. 35 లక్షలకు పైనే ధర ఉంటుందని తెలుస్తోంది. వాస్తవానికి అక్కడ జీవరాశి బతికే అవకాశం ఉందా? లేదా? అనే విషయంలో ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ లేదు.

 

కానీ, చాలా మంది తమ ప్రెస్టేజీ కోసం అక్కడ భూమిని కొనుగోలు చేస్తున్నారు. చంద్రుడి మీద కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టారు. బాలీవుడ్‌ నటులు షారుఖ్ ఖాన్, సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఇప్పటికే అక్కడ భూమిని కొన్నారు.
మరోవైపు చంద్రయాన్‌ 3 మిషన్‌ విజయవంతం అయిన విషయం తెలిసిందే. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొందరు సదరు మహిళలు చేసిన పనికి మెచ్చుకోగా మరికొందరు ఆమెపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ ట్రోల్స్ చేస్తున్నారు. పిచ్చి కాకపోతే అక్కడ జీవరాసులు బతికే అవకాశం ఉందా లేదా అన్నది కూడా తెలియకుండా చందమామపై భూములు కొనుగోలు చేయడం ఏంటి అంటూ మండిపడుతున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -