AP Recruitments: ఎలాంటి రాతపరీక్ష లేకుండా రూ.50,000 వేతనంతో జాబ్.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

AP Recruitments:  నిరుద్యోగులకు శుభవార్త, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఏపీ ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్ ని తీసుకువచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ జిల్లా నేషనల్ హెల్త్ మిషన్ కింద వివిధ కార్యక్రమాల్లో కాంట్రాక్ట్ ప్రతిపాదన అండ్ అవుట్సోర్సింగ్ ప్రతిపాదన కింద పనిచేయటానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అర్హత ఉన్నవాళ్లు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎలాంటి పరీక్షలు లేకుండా డైరెక్ట్ సెలక్షన్ చేసి ఉద్యోగాన్ని ఇస్తారు. అయితే ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ హెల్త్ మెడికల్ అండ్ కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా విడుదల చేయబడింది ఈ నోటిఫికేషన్. 54 పోస్టుల రిక్రూట్మెంట్ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయబడింది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ కింది అర్హతలు తప్పనిసరిగా ఉండాలి.

వయసు 42 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఈ ఉద్యోగానికి అనర్హులు.అయితే టెన్త్, ఇంటర్, ఐటిఐ లేదా డిగ్రీ, డిప్లమా, ఎంఎస్సీ,ఎంబీబీఎస్ పూర్తి చేసిన వాళ్లు పోస్టులను బట్టి అప్లై చేసుకోవాలి. ఫిజియోథెరపిస్ట్, మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్ ఇలా చాలా పోస్టులు ఉన్నాయి. పోస్టులను బట్టి అర్హతలు ఉన్నాయి కాబట్టి గమనించండి. అలాగే ఈనెల 30 వరకు జాబ్ అప్లై చేసుకోవటానికి అవకాశం ఉంది. రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ చేసి మెరిట్ ఆధారంగా ఉద్యోగం ఇస్తారు.

అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వయోపరిమితిలో వయోసడలింపు కూడా ఉంటుంది. ఐదు సంవత్సరాలు ఎక్స్ సర్వీస్మెన్ కి, మూడు సంవత్సరాలు శారీరక వికలాంగులకు 10 సంవత్సరాలు మినహాయింపు ఉంది. ఇక జీతం విషయానికి వస్తే జీతం కింద 12,000 నుంచి 54,000 వరకు ఇస్తారు. సొంత గ్రామాల్లోనే ఉద్యోగాన్ని పొందవచ్చు. దరఖాస్తు ఫీజు 300 రూపాయలు చెల్లించవలసి వస్తుంది. పూర్తి వివరాల కోసం ఈ క్రింది వెబ్సైట్ ని క్లిక్ చేయండి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -