Ambedkar Nagar: అమ్మాయిని ఏడిపించిన రిక్షా డ్రైవర్.. బట్టలు విప్పి రోడ్డుపై?

Ambedkar Nagar: ప్రస్తుత రోజుల్లో ఆడది రోడ్డుపై కనిపించింది అంటే చాలు మృగాళ్లు రెచ్చిపోతున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా వారిపై అత్యాచారాలకు ఒడిగట్టడం వారిని వేధించడం హత్యలు చేయడం లాంటివి చేస్తున్నారు. నిత్యం దేశవ్యాప్తంగా పదుల సంఖ్యలో వాడే వారిపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. కామాంధులు కామంతో ఊగిపోతున్నారు. ఆడవారు ఎదురు తిరిగితే వారిపై అత్యాచారం చేయడం చివరికి వారిని చంపడం లాంటివి కూడా చేస్తున్నారు. ప్రభుత్వం ఆడవారి కోసం ఎన్ని రకాల చట్టాలను తీసుకువచ్చినప్పటికీ కామాంధులకు సరైన అడ్డుకట్ట వేయలేకపోతోంది.

తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. అసలు ఏం జరిగిందంటే.. ఉత్తర్ ప్రదేశ్ అంబేద్కర్ నగర్ అక్బర్ పూర్ పరిధిలోని షాజాద్ పూర్ ఫౌంటెన్ ప్రాంతంలో ఒక వ్యక్తి ఈ రిక్షాను నడుపుతున్నాడు. అయితే ఇటీవల ఒక విద్యార్థిని కాలేజ్ కు వెళ్లేందుకు అతని రిక్షా ఎక్కింది. ఇక ఆటో బయలుదేరే ముందు ఆ రిక్షా డ్రైవర్ ఆ విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయబోయాడు. దీంతో అలెర్ట్ అయిన ఆ అమ్మాయి పెద్దగా అరుపులు వేసింది. వెంటనే గమనించిన స్థానికులు ఏం జరిగిందంటూ ఆ అమ్మాయిని అడిగి తెలుసుకున్నారు.

 

కోపంతో ఊగిపోయిన స్థానికులు ఆ రిక్షా డ్రైవర్ ను చితకబాదారు. అంతేకాకుండా నడిరోడ్డుపై అతని బట్టలు విప్పి గట్టిగా బుద్ది చెప్పారు. పబ్లిక్ లో అందరూ చూస్తుండగానే అతని బట్టలు విప్పి అతని ప్యాంటు పట్టుకుని వీధి వీధి తిప్పుతూ అందరూ వస్తుండగా గట్టిగా బుద్ధి చెప్పారు. ఆ తర్వాత ఆ దుర్మార్గుడిని అందరూ కలిసి పోలీసులకు అప్పగించారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోని చూసిన నెటిజన్స్ కరెక్ట్ గా బుద్ధి చెప్పారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు వాడికి ఇంకా నాలుగు దెబ్బలు తగిలించాల్సింది అప్పుడు బుద్ధి వచ్చేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -