Navratri Fasting Rules: నవరాత్రుల్లో ఉపవాసం చేయాలని అనుకుంటున్నారా.. తప్పనిసరిగా పాటించాల్సిన చిట్కాలివే!

Navratri Fasting Rules: చెడుపై మంచి సాధించిన విజయాన్ని జరుపుకునే హిందూ మతం యొక్క ముఖ్యమైన పండగలలో నవరాత్రి ఒకటి. స్త్రీ శక్తికి ప్రతిరూపంగా జరుపుకునే పండగ దసరా నవరాత్రులు. నవరాత్రుల సమయంలో హిందూ భక్తులు దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి తొమ్మిది రోజులపాటు ఉపవాసం ఉంటారు. ఉపవాస రోజుల సంఖ్యలో వైవిధ్యం ఉండవచ్చు,అలాగే కొందరు పూర్తి ఉపవాసం పాటిస్తారు, కొందరు ఒంటిపూట ఉపవాసం పాటిస్తారు.

కొందరు పండ్లు వంటివి తీసుకుంటారు. అయితే ఉపవాసం సమయంలో తీసుకునే ఆహారం మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి ఎందుకంటే ఉపవాసం తర్వాత తీసుకునే ఆహారం ఆరోగ్యకరమైనదిగా మరియు తేలికగా జీర్ణం అయ్యేదిగా ఉండాలి. నవరాత్రి సమయాలలో గోధుమలు మరియు బియ్యం వంటి సాధారణ ధాన్యాలు అనుమతించబడవు.

నవరాత్రి ఉపవాస సమయంలో అన్ని రకాల పండ్లను తినవచ్చు. అయితే ఈ సమయంలో శరీరంలో క్యాలరీలు కొవ్వు మరియు చక్కెర కచ్చితంగా పెరుగుతుంది. ఈ విషయం దృష్టిలో పెట్టుకొని చక్కెర తక్కువగా ఉండే పండ్లను తినటానికి ప్రయత్నించండి. ఉపవాస సమయంలో శరీరం హైడ్రేషన్ గా ఉండాలి. దీనికోసం తగినంత నీరు త్రాగటంతో పాటు నిమ్మరసం లేదా కొబ్బరి నీరువంటి ద్రవపదార్థాలను త్రాగవచ్చు. ఇక ఉపవాసం తర్వాత చేసే భోజనం హెవీగా ఉండకూడదు. ఆకలి మీద ఉన్నాను కదా అని కడుపునిండా భోజనం చేస్తే అది మరుసటి రోజు ఉపవాసానికి భంగం కలిగిస్తుంది.

కాబట్టి భోజనం విషయంలో శ్రద్ధ వహించండి. ఎక్కువగా నూనెతో చేసిన పదార్థాలను తినటం మానుకోండి. పెరుగు, లస్సి, మజ్జిగ వంటి కొవ్వు తక్కువగా ఉండే పదార్థాలని తీసుకోవటం ఉత్తమం. కూరగాయలలో దోసకాయ, టమాట, మొదలైన వాటిని తీసుకోవచ్చు. అయితే ఆహారంగా ఏం తీసుకున్నప్పటికీ ఒక క్రమ పద్ధతిలో లిమిట్ పెట్టుకొని తినడం మంచిది. ఉపవాస సమయంలో ఆహారంలో మార్పు వస్తుంది. దీని ప్రభావం మనసు మీద శరీరం మీద కూడా పడుతుంది. కాబట్టి ఆయా వ్యక్తులు చిరాకుని నీరసాన్ని కలిగి ఉంటారు. కాబట్టి తగినంత నిద్ర తీసుకొని మరుసటి రోజు ఉపవాసానికి శరీరాన్ని సిద్ధం చేయటం ఉత్తమం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -