Annadhanam: లడ్డూ, తాంబూలంతో అన్నదానం చేస్తే దుష్ట శక్తులు దూరమవుతాయి!

Annadhanam: అన్ని దానాలో కెల్లా అన్నదానం గొప్పదంటారు. అందుకే చాలా మంది అన్నదానాలు చేస్తుంటారు. వర్ధంతులు, పుట్టిన రోజులు , ప్రత్యేక దినాల్లో అన్నదానాలు చేస్తుంటారు. గుళ్లు, దర్గాలు, చర్చీల వద్ద కూడా కొన్ని ప్రత్యేక రోజుల్లో అన్నదానాలు చేస్తుంటారు. కొందరు రూ. కోట్లలో ఖర్చు చేసి నిత్యాన్నదాన కార్యక్రమాలు చేపడుతుంటారు. విదేశాల్లో ఉన్నా కూడా డబ్బులు పంపించి వారి వారి పేర్ల మీద అన్నదానాలు చేస్తుంటారు.

అయితే అన్నదానాల్లో కూడా ఒకొక్కరు ఒక్కోలా చేస్తుంటారు. ఇలాంటి కార్యక్రమాలు చేపడితే పుణ్యం లభిస్తోందని శాస్త్రలు చెబుతుంటాయి. కొందరు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఎంత ప్రయత్నించినా సరైన రాబడి లేకపోవడం దానికి తోడు విపరీతమైన ఖర్చులతో సతమతమవడం జరుగుతుంది. అలాంటివారు అన్నంతో లడ్డూ పెట్టి.. తాంబూల సహితంగా దానం ఇస్తే అధిక ఆదాయం పొందడంతో పాటు శ్రీమంతులయే అవకాశం ఉంది. ఇక అనారోగ్యంతో బాధపడుతున్నవారు

దీర్ఘ రోగాలతో సతమతవుతున్నవారు అన్ని రోగాలు తొలిగి సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. కొన్నిసార్లు ఇంటిపై మాంత్రిక దోషాలు కూడా కలుగుతుంటాయి. అలాంటప్పుడు చిత్రాన్నంతో పాటు వడ దానం చేస్తే గృహంంపై ఏ విధమైన మంత్ర సంబంధమైన దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. కొందరు తమ కుటుంబాన్ని మంచి జరగాలని.. ఉన్న అప్పులు తీరాలని కూడా ఇష్ట దేవుళ్లును కొరుకుంటారు. అవి నిజమైతే ఎంత ఖర్చుఅయినా వెనకాడకుండా అన్నదానాలు చేస్తుంటారు. అన్నదానంతో వారికి పుణ్యంతో పాటు ఆకలితో అలమటిస్తున్న వారి కడుపు నింపిన వారువుతారని పండితులు చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -