Spiritual: లేచిన వెంటనే తుమ్మితే ఏం జరుగుతుంది? తుమ్ము దేనికి సంకేతం?

Spiritual: సాధారణంగా మనం ఏదైనా ఘాటు వాసన చూసినప్పుడు కానీ లేదంటే దగ్గు, జలుబు చేసిన సమయంలో ఎక్కువగా తుమ్ముతూ ఉంటాం. ఎక్కువగా ఉట్టి మిరపకాయ లాంటి ఘాటు వాసన తగిలితే తుమ్ములు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే తుమ్ములు రావడం మంచిదే అయినప్పటికీ అతిగా తుమ్ములు వస్తే చాలా ప్రమాదకరమైన వైద్యులు చెబుతున్నారు. అలాగే చాలామంది ఎప్పుడైనా బయటికి వెళ్లేటప్పుడు తుమ్మితే వెళ్లే పనులు జరగవు అని తిట్టుకుంటూ ఉంటారు.

అలా తుమ్మినప్పుడు కొద్దిసేపు కూర్చొని లేదంటే నీళ్లు తాగి బయటికి వెళ్తూ ఉంటారు. ఇలా తుమ్ములను అపశకునంగా కూడా భావిస్తూ ఉంటారు. మరి ఉదయం లేచిన వెంటనే తుమ్మితే ఏం జరుగుతుంది? నా ఉదయం లేవగానే తుమ్మడం దేనికి సంకేతంగా భావిస్తారు? అలా తుమ్మడం మంచిదేనా ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రధానంగా ఒక తుమ్ము తుమ్మితే కీడును సూచిస్తుందని, అలాగని ఎక్కువ తుమ్ములు కూడా మంచిది కాదు అంటున్నారు. ఉదయం లేవగానే తుమ్మితే శుభం కలుగుతుందట.

అలాగే పసిపాపలు,శిశువులు, ఐదేళ్లలోపు ఉన్న పిల్లలు తుమ్మడం వల్ల లాభం అలాగే వస్త్ర ప్రాప్తి కూడా లభిస్తుంది. అదేవిధంగా చేతిలో ఇనుము కానీ బంగారం కానీ పట్టుకొని తుమ్మితే కార్యాహాననీ జరుగుతుంది. అలాగే కంచు,,రాగి వస్తువులు పట్టుకున్నవాడు తుమ్మితే కార్యసిద్ధి. అదేవిధంగా ఎప్పుడైనా తుమ్మినప్పుడు బంగారం, మొసలి, ఆడవారి నాట్యం, తాంబూలం వేసుకున్న వారి మొహం చూస్తే కీడు సంభవిస్తుంది. అదేవిధంగా నీటి వద్ద పదిమందిలో ఉన్నప్పుడు తుమ్మితే ఉన్నప్పుడు అవమానం కలుగుతుందట.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -