Liquor Scam: ఏపీ మద్యం స్కాం ద్వారా వేల కోట్లు దోచేశారా.. ఏపీ మద్యం తాగితే బ్రతకడం కష్టమేనా?

Liquor Scam: ఆ మధ్య ఒక సినీ నటుడు ఏపీ మద్యం తాగుతూ నేను ఏపీ మద్యం తాగుతున్నాను, బ్రతికుంటే మళ్ళీ కలుస్తాను అంటూ చేసిన ఒక వీడియో ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. అతను చేస్తున్నది కామెడీ అనుకున్నాడు కానీ నిజంగానే ఆంధ్రప్రదేశ్ లో మందు తాగితే పరలోకానికి ప్రయాణం అనే భయం అందరికీ ఎప్పుడో మొదలైంది. ఎందుకంటే ఏపీలో జరుగుతున్న మద్యం స్కాం మన ఊహకి కూడా అందనిది. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మరీ రక్త మాంసాలని పిండుకుంటున్న వేలకోట్ల అవినీతి బాగోతం ఇది.

నిజానికి కొన్ని వేలకోట్ల నగదు రూపంలో లావాదేవీలు జరుగుతున్నాయి. దర్యాప్తు అంటూ ప్రారంభిస్తే పెద్ద తలకాయలు ఈజీగా దొరికిపోతాయి. నిజానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటపడినప్పుడు, అక్కడ మనీ ట్రాన్సాక్షన్ గురించి తెలిసిన తర్వాత అందరూ అవాక్కయ్యారు. కానీ ఏపీ ప్రజలు మాత్రం అలా అనుకోవడం లేదు. ఎందుకంటే ఇక్కడ స్కాం అంతకు మించి జరుగుతున్నది.

ఇతర రాష్ట్రాలలో మద్యం స్కామ్ లో చూసిన తర్వాత ఏపీ లిక్కర్ పాలసీ గురించి ఎవరైనా తెలుసుకుంటే కనీ వినీ ఎరుగని రేంజ్ లో ఇక్కడ స్కామ్ జరిగిందన్న అభిప్రాయం ఎవరికైనా కలుగుతుంది. నిజానికి ఇదంతా ప్రభుత్వ పెద్దలు గుప్పెట్లో ఉంది. అమ్మేది ప్రభుత్వం పేరు మీదే కానీ తయారి బ్రాండ్లు,రవాణా, అమ్ముతున్న మనుషులు అందరూ ఈ పెద్దవాళ్ళ గుప్పెట్లోనే ఉంటారు. పైగా అంతా నగదు లావాదేవీలు జరుగుతుండడం మూలంగా ఎన్ని వేల కోట్లు వెనకేసుకొచ్చారో చెప్పటం కష్టం.

అయితే ఏపీలో ఎంత జరుగుతున్నప్పటికీ కేంద్రం దీనిపై దృష్టి పెట్టలేదు. అయితే ఇప్పుడు బిజెపి నేతలు ఈ లిక్కర్ పాలసీపై దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. స్వయంగా పురందరేశ్వరి సీబీఐకి ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. చూడాలి ఇప్పటికైనా కేంద్రం దీని మీద దృష్టి పెడితే ఎన్ని పెద్ద తలకాయలు బయటపడతాయో.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -