SSC Results: పది ఫలితాల్లో సత్తా చాటిన కవల ఆడపిల్లలు.. నిజంగా గొప్పోళ్లంటూ?

SSC Results: కష్టపడితే ఫలితం దానంతట అదే వస్తుంది అని అంటూ ఉంటారు. అంతేకాకుండా కష్టాలు, దుఃఖాలు సుఖాలు ఎన్ని ఎదురైనా కూడా కష్టపడి పనిచేసే వారికి ఎప్పటికైనా సుఖం లభిస్తుందని సమాజంలో గుర్తింపు దక్కుతుందని అంటూ ఉంటారు. ఆ సమాజంలో చాలామంది తల్లిదండ్రులు ఉన్న పిల్లలు తల్లి ఉండి తల్లి లేని పిల్లలు తండ్రి ఉండి తల్లి లేని పిల్లలు చాలామంది మంచి మంచి ఉన్నత విద్యలు అభ్యసించి సమాజంలో గుర్తింపు తెచ్చుకున్నారు. అటువంటి వారిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే కవల పిల్లలు కూడా అటువంటివారే. కవల ఆడపిల్లలని పుట్టగానే తండ్రి వదిలేశాడు.

దాంతో ఆ కవల పిల్లలను అమ్మ, అమ్మమ్మ, తాతయ్యలే అన్నీ అయి చదివించారు. అయితే ఆ కవల పిల్లలు వాళ్ల పెద్దవారి శ్రమను వృథా కానివ్వలేదు. ఆ కవల లిద్దరూ ఎస్సెస్సీలో 10 జీపీఏ సాధించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నానికి చెందిన రిటైర్డ్‌ ఉద్యోగి అల్లెంకి వీరేశంకు కూతురు, కొడుకు ఉన్నారు. కూతురు కవిత పెద్దపల్లి కలెక్టరేట్‌లో ఔట్‌సోర్సింగ్‌లో ఎల్రక్టానిక్స్‌ జిల్లా మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అయితే 16 ఏళ్ల క్రితం కవితకు ఏడో నెల సమయంలో డెలివరీ కోసం భర్త ఆమెను పుట్టింటికి పంపించాడు. కవల కూతుళ్లు పుట్టడంతో ఇక్కడే వదిలేశాడు.

 

దాంతో అప్పటినుంచి వారి ఆలనపాలనా అమ్మమ్మ వనజ, తాతయ్య వీరేశం చూస్తున్నారు. శర్వాణి, ప్రజ్ఞాని 5వ తరగతి వరకు ప్రయివేటు స్కూల్‌లో, 6వ తరగతి నుంచి మోడల్‌ స్కూల్ లో చదివారు. తాజాగా విడుదల అయిన ఎస్సెస్సీ ఫలితాల్లో కవల పిల్లలు ఇద్దరూ కూడా 10 జీపీఏ సాధించారు. అమ్మమ్మ, తాతయ్యలు, ప్రిన్సిపాల్‌ జ్యోతి ప్రోత్సాహంతోనే 10 జీపీఏ సాధించాం అని శర్వాణి, ప్రజ్ఞాని తెలిపారు. తండ్రి వదిలేసినప్పటికీ తల్లి ఆశయాలను నెరవేర్చడం కోసం ఆ కవల పిల్లలు ఇద్దరు కష్టపడి ఇద్దరు 10 జిపిఎస్ సాధించడం అనేది నిజంగా గొప్ప విశేషమని చెప్పవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -