Beauty Parlour: బ్యూటీ పార్లర్ కు వద్దని చెప్పాడని ఆత్మహత్య చేసుకున్న భార్య.. ఏమైందంటే?

Beauty Parlour: ఏంటో ఈ మధ్యకాలంలో కొన్ని కొన్ని వార్తలు వింటుంటే నవ్వాలా.. ఆశ్చర్యపోవాలా అర్థం కాదు. ఎందుకంటే అంత విచిత్రం ఉంటాయి కాబట్టి. నిజానికి ఈ మధ్యకాలంలో జనాల ఆలోచనలు కూడా మొత్తం మారిపోయాయి. ఎందుకో ప్రతి చిన్న దాన్ని పెద్దదిగా చేస్తూ బాగా రచ్చ చేస్తూ ఉంటారు. ప్రతి చిన్న విషయాలకి ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అంటే మనుషుల ఆలోచనలు ఎలా ఉంటున్నాయో అర్థం చేసుకోవచ్చు.

 

ఇప్పటికే మొబైల్ ఫోన్ వద్దన్నందుకు పిల్లలు ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. పరీక్షల్లో తప్పినందుకు.. ప్రియురాలు కాదన్నందుకు.. భార్య కూర వండలేదని ఇలా ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఇప్పటివరకు చూసాం. అయితే తాజాగా భర్త బ్యూటీ పార్లర్ కు వెళ్లొద్దని మందలించినందుకు ఆత్మహత్య చేసుకున్న చోటు చేసుకుంది.

 

కేవలం బ్యూటీ పార్లర్ కు వద్దన్నందుకే ఆత్మహత్య చేసుకుందంటే ఇది నిజంగా ఆశ్చర్య పోవాల్సిన విషయమే అని చెప్పాలి. ఎవరైనా వద్దన్నా విషయానికి ఆత్మహత్య చేసుకుంటారా. ఏదైనా ఉంటే సర్దుకోవాలి లేదా బ్రతిమాలుకోవాలి. అంతేకాని ప్రతి చిన్న దానికి ఆత్మహత్యలు చేసుకుంటూ పోతే చివరికి ఈ భూమి మీద ఎవరు మిగలరు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగింది అంటే..

 

మధ్యప్రదేశ్ లో ఇండోర్ లో బలరాం యాదవ్, రీనా అనే దంపతులు నివసిస్తున్నారు. అయితే వీళ్లకు అప్పటికే చిన్న చిన్న మనస్పర్దాలు రావడంతో పదేపదే గొడవ పడే వారిని ఇరుగుపొరుగు వాళ్ళు చెబుతున్నారు. కొన్ని సందర్భాలలో అందరూ కలిసి సర్ది చెప్పినప్పటికి వాళ్ళు మారలేదని తెలిసింది. అయితే రీనా బ్యూటీ పార్లర్ కి వెళ్లగా.. ఆ విషయం తెలిసిన బలరాం యాదవ్ వెంటనే భార్యను మందలించాడు.

 

ఇకపై బ్యూటీ పార్లర్ కు వెళ్లదని చెప్పి బయటికి వెళ్లాడు. ఇక వెంటనే రీనా భర్త మందలించాడని కోపంతో గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. ఇక బలరాం ఇంటికి తిరిగి వచ్చాక భార్యని పిలిచాడు. ఎంతకు తలుపు తీయకపోవటంతో.. అనుమానం వచ్చి తలుపు తెరిచి చూస్తే రీనా ఉరి వేసుకుని కనిపించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని పాత కారణాలన్నీ తవ్వితీస్తున్నట్టు తెలిసింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -