Pavani: అప్పుడు రైతుబిడ్డ.. ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్.. గ్రూప్2 ర్యాంకర్ పావని సక్సెస్ స్టోరీ ఇదే!

Pavani: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా గ్రూప్ వన్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. గ్రూప్ వన్ పరీక్ష ఫలితాలలో అమ్మాయిలు మరోసారి తమ సత్తా చాటారు. టాప్ టెన్ లో మొత్తం ఆరుగురు అమ్మాయిలు ఉండటం విశేషం. ఈ పరీక్ష ఫలితాలలో భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించగా కడప జిల్లాలోని మైదుకూరుకు చెందిన పావని రెండవ ర్యాంకు సాధించారు.

 

ప్రస్తుతం రెండవ ర్యాంకు సాధించినటువంటి పావని రైతుబిడ్డ నుంచి డిప్యూటీ కలెక్టర్ స్థాయికి ఎదిగిన ఈమె సక్సెస్ స్టోరీ హాట్ టాపిక్ అవుతోంది. తన తండ్రి ఒక రైతు ఇలా రైతు బిడ్డగా తల్లిదండ్రులు కష్టపడుతూ తనను చదివించాలని అయితే ఆ కష్టానికి తగ్గ ఫలం అన్న ఉద్దేశంతోనే తాను గ్రూప్స్ పై ఫోకస్ చేశానని తెలిపారు.ఒకవైపు కాలేజీ లెక్చరర్ గా పని చేస్తూనే మరోవైపు గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యారు.

పావని ఎలాంటి కోచింగ్ లేకుండా కాలేజీ లెక్చరర్ గా పనిచేస్తూనే సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకొని మరి ఈ పరీక్షలకు హాజరయ్యారు అయితే ఈమె ఈ పరీక్షలలో రెండవ ర్యాంకు సాధించడంతో ఎంతోమంది సన్నిహితులు, బంధువులు కుటుంబ సభ్యులు ఈమె సాధించిన విజయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే తనకు రెండవ ర్యాంకు రావడంతో పావని సైతం సంతోషం వ్యక్తం చేశారు.

 

తాను లెక్చరర్ గా పనిచేస్తూనే ఎంతో కష్టపడుతూ చదివాననే సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నానని తాను ఎలాంటి కోచింగ్ తీసుకోలేదని ఈమె తెలిపారు. ఇక ఇంటర్వ్యూలో కూడా తనని అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పానని పావని వెల్లడించారు.అయితే ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా మన లక్ష్యాన్ని చేరుకోవడం దిశగా అడుగులు వేస్తే ఎవరైనా లక్ష్యాన్ని చేరుకోవచ్చు అంటూ ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -