Homams: హోమాలు చేయడం వల్ల ఏకంగా ఇన్ని లాభాలు ఉన్నాయా.. ఆ సమస్యలు దూరమయ్యే ఛాన్స్ ఉందా?

Homams: మామగా మనం అనేక సందర్భాలలో హోమాలు చేయడం జరపడం లాంటివి చేస్తూ ఉంటాం. అయితే నిజానికి హోమాలు చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అన్న సందేహం చాలా మందికి కలిగే ఉంటుంది. మరి హోమాలు చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మాములుగా ఎవరి జాతకంలో అయినా దోషం ఉంటే పరిహారం కింద హోమం చేస్తూ ఉంటారు. సకాలంలో వానలు కురవాలని కూడా హోమాలని చేస్తూ ఉంటారు. హోమాలని పూర్వకాలం నుండి కూడా చేస్తున్నారు.

అయితే గ్రహాల ప్రభావంతో ప్రతికూల ప్రభావాలు వచ్చే అవకాశాలు ఉంటే శాంత పరచడానికి హోమాలు చేస్తూ ఉంటారు. హోమం చేయడం వలన మనం కోరుకున్న కోరికల్ని అగ్నిదేవుడు దేవుళ్ళకి నేరుగా చెప్తాడ‌ని మన నమ్మకం. అయితే హోమాల్లో చాలా రకాలు కూడా ఉంటాయి. జీవితంలో చాలా మంది చాలా రకాల సమస్యల్ని ఎదుర్కొంటారు. వాటి నుండి బయటపడడానికి హోమాలని చేస్తారు. వినాయకుడి అనుగ్రహం పొందాలని వినాయకుడికి హోమం చేస్తూ ఉంటాము. గణపతి హోమం చేస్తే ఆర్థిక సమస్యలు వుండవు. శివ హోమం చేయడం వలన చక్కటి ప్రయోజనాలను పొందొచ్చు.

పెళ్లి విషయంలో ఇబ్బందులు వచ్చి, రెండు కుటుంబాలు కూడా పెళ్లి క్యాన్సిల్ చేసుకునే సందర్భాలలో ఇటువంటి హోమాలను చేస్తారు. సోమవారం నాడు ఈ హోమం చేస్తారు. విద్యలో వెనకబడి ఉన్నట్లయితే, నీల సరస్వతి దేవి హోమం చేస్తారు. సిద్ది గణపతి హోమం, దక్షిణామూర్తి హోమం, విద్యా గణపతి హోమం వంటివి కూడా చేస్తూ ఉంటారు. కొంతమంది పరోక్షంగా ఇతరులని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ల‌ నుండి రక్షణని పొందడానికి మహా సుదర్శన హోమాన్ని చేస్తారు. ఆర్థిక సమస్యలతో బాధపడే వాళ్ళు కుబేర లక్ష్మి హోమాన్ని చేస్తూ ఉంటారు. దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడే వాళ్ళు ధన్వంతరి హోమాన్ని చేస్తారు. అలానే నవగ్రహ హోమాన్ని కూడా చేస్తూ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల హోమాలు ఉన్నాయి. అలా హోమాలు చేయడం వల్ల ఆయ సమస్యల నుంచి బయటపడవచ్చని పండితులు చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

The Land Titling Act: ఏపీ ఓటర్లకు అలర్ట్.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తెలుసుకుని ఓటేస్తే బెటర్!

The Land Titling Act: ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వము...
- Advertisement -
- Advertisement -