Rakhi: రాఖీని కట్టే సమయంలో పాటించాల్సిన నియమాలు ఇవే.. ఈ తప్పులు మాత్రం చేయొద్దంటూ?

Rakhi: నేడు రక్షాబంధన్ అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ పండుగను అన్నా చెల్లెల్లు, అక్క తమ్ముళ్లు ఎంతో ఆనందంగా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. అక్క లేదా చెల్లెలు అన్నదమ్ములకు రాఖీ కట్టడం అన్నలు చెల్లెళ్లకు అక్కలకు విలువైన బహుమతులను ఇవ్వడం అన్నది ఎప్పటినుంచో వస్తున్న ఆచారం. మిగతా రోజులు ఎంతగా కొట్టుకున్న తిట్టుకున్నా కూడా రక్షాబంధన్ పండుగ రోజు మాత్రం ఇద్దరూ కలిసికట్టుగా ఎంతో సంతోషంగా ఉంటారు. ఎప్పుడూ కొట్టుకున్న కూడా మనసులో మాత్రం ఒకరిపై ఒకరికి బోలెడంత ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయి.

హిందూ ధర్మంలో పౌర్ణమి అందులోను శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఈ రోజునే రాఖీ పౌర్ణమికి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది.
అయితే పురాణాల ప్రకారం రాఖీ కట్టేటప్పుడు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. మరి ఆ నియమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అలాగే పండుగ తర్వాత ఎలా పడితే అలా రాఖీ తీసేయకూడదట. దానికీ కొన్ని నియమాలు ఉన్నాయి. అవేంటో రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలుసుకుందాం.. రాఖీని ఎక్కువ రోజుల పాటు ఉంచుకోకూడదట. అలాగే ఒకవేళ రాఖీ తెగిపోయినా విరిగిపోయినా కూడా చేతికి ఉంచకూడదు. వెంటనే తీసేయాలి. అలాగే తీసిన రాఖీని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ప్రవహించే నీటిలో వేయాలి.

 

ఒకవేళ రాఖీ విరిగిపోతే రూపాయి నాణెంతో పాటు చెట్టు కింద ఉంచాలట. దీనికి తోడు రాఖీ కట్టే ముందు సోదరుడు తూర్పు దిక్కున సోదరి ముఖం పడమర లేదంటే ఉత్తరం దిశ వైపు తిరిగి ఉండాలట. అలాగే నలుపు రంగు రాఖీలు కట్టకూడదు..ఇక రాఖీని కట్టించుకునే సోదరులు కూర్చొని మాత్రమే కట్టించుకోవాలి. అయితే మంచంపై మాత్రం కూర్చోకూడదు. మహూరత్ సమయంలో రాఖీ కట్టాలి. భద్రకాలంలో కట్టకూడదు. అలాగే రాఖీ కట్టించుకునే సోదరులు తమ తలను రుమాలుతో కప్పుకోవాలి. శ్రావణ పూర్ణిమ తేదీ నేడు మొదలై రేపు అనగా గురువారం ఉదయం 07:05 గంటలకు ముగుస్తుంది. ఈ సమయంలో రాఖీ ఎప్పుడు కట్టాలంటే నేటి రాత్రి 9:03 గంటల నుంచి 11:00 గంటల వరకూ అలాగే రేపు తెల్లవారుజామున 04.03 గంటల నుంచి ఉదయం 07.05 వరకు రాఖీ కట్టవచ్చట. ఆగస్టు 30 రాత్రి సమయంలో పౌర్ణమి గడియలు ఉన్నప్పటికి అది భద్రకాలం కాదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -