Transgender: సుఖం కోసం రూమ్ బుక్ చేసి అలా చేస్తారట.. ఏం జరిగిందంటే?

Transgender: ఈ సమాజంలో కేవలం ఆడ మగ అని తేడాలను గమనించి వారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ఈ సమాజంలో మూడవ లింగమైనటువంటి హిజ్రాలు కూడా ఉన్నారనే విషయాన్ని చాలా మంది గుర్తించడం లేదు. ఇలా వారిని గుర్తించకపోవడమే కాకుండా వారి పట్ల సమాజంలో ఎంతో చిన్న చూపు చులకన భావన కూడా ఉందని చెప్పాలి. అయితే హిజ్రాలు కూడా సమాజంలో కూటి కోసమే బ్రతుకుతూ పనులు చేస్తుంటారు.

ఇలా పనులు చేస్తూ కాస్త మెతుకులు సంపాదించుకుందామని ప్రయత్నాలు చేస్తున్న వారు హిజ్రాలు అని గుర్తిస్తే వారికి ఎలాంటి పనులు కూడా ఇవ్వడం లేదంటూ పలువురు హిజ్రాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా పని దొరకకపోవడం వల్ల అడుక్కుంటున్నామని,ఇలా డబ్బులు అడిగే సమయంలో కూడా మా పట్ల చిన్నచూపు చూస్తున్నారు అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాజాగా అక్షయ అనే ఓ హిజ్రా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సమాజంలో తమ పట్ల ప్రజలు చూస్తున్నటువంటి చిన్న చూపు గురించి షాకింగ్ విషయాలు బయట పెట్టారు.

 

సాధారణంగా ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు హిజ్రాలను తీసుకెళ్తే మంచిదని భావిస్తారు. ఇలా చాలామంది పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తామని చెప్పి మమ్మల్ని తీసుకెళ్తారని అయితే పని పూర్తి అయిన తర్వాత మా చేతిలో వెయ్యి రూపాయలు పెట్టి వెళ్ళిపోతారని అక్షయ తెలియచేశారు. ఇక చాలామంది మా కోసం రూమ్ బుక్ చేసి అక్కడికి కూడా పిలుస్తుంటారని ఈమె తెలియజేశారు.

 

ఇలా గంట సుఖం కోసం లక్షలు పెట్టి రూమ్ బుక్ చేస్తారు అయితే పని అయిపోగానే మాకు ఇవ్వాల్సిన డబ్బు మాత్రం ఇవ్వరని, ఒకరి కోసం రూమ్ బుక్ చేస్తే పదిమంది వరకు వస్తారని, వారి పనులు అయిపోగానే ఏ పాతికో పరకో తమ చేతిలో పెట్టి వెళ్లిపోతారు. మరికొందరైతే డబ్బులు కూడా ఇవ్వకుండా పని పూర్తి అయితే వెళ్లిపోతారు అంటూ అక్షయ ఈ సందర్భంగా తమ ఆవేదన వ్యక్తం చేస్తూ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -