Mantra: ఇంటినుంచి పోయిన వాళ్లు తిరిగిరావాలంటే జపించాల్సిన మంత్రం ఇదే!

Mantra: మామూలుగా కొంతమంది మతిస్థిమితం లేక ఇంట్లో నుంచి వెళ్ళిపోతే కొంతమంది ఏవైనా తప్పులు చేసినప్పుడు తిడతారేమో కొడతారేమో అన్న భయంతో ఇల్లు వదిలి వెళ్ళిపోతూ ఉంటారు. అలా రకరకాల కారణాల చేత ఇల్లు వదిలి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది కావాలనే కంటికి కనిపించకుండా దూరంగా వెళ్లిపోతూ ఉంటారు. అటువంటి వారి కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా దొరకలేదు అని దిగులు చెందుతూ ఉంటారు. అయితే అలా ఇంటి నుంచి వెళ్లిపోయిన వారు తిరిగి మళ్ళీ రావాలి అంటే ఒక మంత్రాన్ని మీరు స్మరిస్తే చాలు అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

ఇంతకీ ఆ మంత్రం ఏంటి అన్న విషయాల్లోకి వెళితే…
స్నానం చేసిన తర్వాత శుచిగా మీరు ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా స్మరిస్తే, మీరు కోల్పోయిన వాటిని తిరిగి పొందవచ్చు. డబ్బుని కానీ మనశ్శాంతిని కానీ లేదంటే మీ ఇంటి నుండి ఎవరైనా వెళ్ళిపోయినా కానీ తిరిగి మీరు పొందవచ్చు. దృఢ సంకల్పంతో ఈ మంత్రాన్ని చెప్పుకోవడం వలన చక్కటి ఫలితం లభిస్తుంది. “కార్తవీర్యార్జునో నామ రాజా బాహుసహస్రవాన్..తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే”.. అనే ఈ మంత్రాన్ని, మన మనసులో కోరికని చెప్పుకుని రోజూ పూజ చేస్తే కోల్పోయిన వాటిని మళ్లీ మనం పొందవచ్చు. కార్తవీర్యార్జునుడు ఎవరంటే విష్ణుమూర్తి కుడి చేతిలో ఉండే సుదర్శన చక్రం అంశ.

 

చేతిలో ఇది ఉండడం వల్లే విష్ణుమూర్తి రాక్షసులని సంహరించగలిగాడు. సుదర్శన చక్రం వల్లే సంహరించాలని స్వామి గ్రహించి సుదర్శనుని మనిషిగా పుట్టమని ఆదేశిస్తాడు.కానీ భూలోకంలో మనిషిగా పుట్టిన కార్తవీర్యార్జునుడికి చేతులు ఉండవు. చేతులు లేకుండా పుట్టాడు. కానీ దత్తాత్రేయుడుని ప్రార్థించి, వెయ్యి చేతుల కలవాడిగా మారతాడు. అందుకే ఇతన్ని సహస్ర బాహు అని పిలుస్తారు. అలానే శ్రీహరి చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో మరణం రాకుండా ఉండేలా వరాన్ని కూడా ఈయన పొందుతాడు. బలపరాక్రముడు కార్తవీరుడు. అయితే ఇంట్లో ఏమైనా పోయినా లేదంటే మీరు తిరిగి దేనినైనా పొందాలన్నా, పైన చెప్పినట్లు పాటించి మళ్లీ వాటిని పొందండి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -