Dishti: ఇతరుల దిష్టి మీపై పోవాలంటే చేయాల్సిన పని ఇదే.. ఆ తప్పులు చేయొద్దంటూ?

Dishti: సాధారణంగా ఒక మనిషి ఆర్థికపరంగా కీర్తి ప్రతిష్టలపరంగా ఎదుగుతూ ఉంటే మరొక వ్యక్తి వారి ఎదుగుదలను చూసి ఓర్చుకోరు. ఆ సమయంలో వారి దృష్టి మనపై పడుతుంది. ఈ దృష్టి చెడు దిష్టికి కారణం అవుతుంది. ఇలా ఇతరుల చెడు దృష్టి మనపై పడితే కనుక తప్పకుండా మనకు దిష్టి తగిలి మన ఎదుగుదలలో ఆటంకాలు ఏర్పడటం ఆర్థిక ఇబ్బందులు రావడం వంటివి జరుగుతూ ఉంటాయి.

మన పై పడిన ఇతరుల దిష్టి మనపై తొలగిపోవాలి అంటే కొన్ని వాస్తు పరిహారాలను పాటిస్తే ఇతరుల చెడు దిష్టి మనపై ఉండదు మరి ఇలా మనపై దిష్టి పడింది అంటే ఏం చేయాలి అనే విషయానికి వస్తే… ప్రతిరోజు ఉదయం లేవగానే స్నానం చేసే సమయంలో చిటికెడు పసుపు స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేయటం వల్ల మనపై ఉన్నటువంటి దిష్టి తొలగిపోతుంది.

 

అదే విధంగా రాత్రి పడుకునే సమయంలో మూడు నిమ్మకాయలను తల దిండు కింద పెట్టుకొని ఉదయం లేవగానే ఆ నిమ్మకాయలను బయటపడేయాలి.
ఇలా చేయడంతో మనకు తగిలినటువంటి దిష్టి తొలగిపోతుంది.చెడు దిష్టి మనకు తగలకుండా ఉండాలి అంటే నల్లని తాడును మెడలో కట్టుకోవడం లేదా కాలికి నల్లని తాడును కట్టుకోవడం వల్ల కూడా దిష్టి ప్రభావం మనపై ఉండదు.

 

ఇక ఒక తెల్లని పేపర్లోశ్రీరామ అనే నామాన్ని 108 సార్లు రాసి ఆ కాగితాన్ని మనం నిద్రపోయే సమయంలో మన తల దిండు కింద పెట్టుకోవాలి.ఇలా చేయడంతో దిష్టి తొలగిపోతుంది అదే కాకుండా ఉప్పును దిగదీసుకుని నీటిలో పడి వేయడం గుమ్మడికాయను దిగదీసుకుని ఎవరూ లేనటువంటి సమయంలోఆ గుమ్మడికాయను నీటిలో వదిలి వేయటం వల్ల దిష్టి మొత్తం తొలగిపోతుంది ఇలా చేయడం వల్ల ఇతరుల చెడు దిష్టి మనపై ఉండదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -