Thummala Nageswara Rao: పార్టీ మార్పుపై ఫుల్ క్లారిటీ ఇచ్చి తుమ్మల నాగేశ్వరరావు

Thummala Nageswara Rao: మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారతారనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. టీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్న ఆయన.. బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యారనే ప్రచారం గత కొద్దికాలంగా సాగుతోంది. బీజేపీ నేతలతో ఆయన టచ్ లోకి వెళ్లారని, త్వరలో పార్టీ మారడం ఖాయమంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇటీవల ఖమ్మం జిల్లాలో టీడీపీ నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. దీంతో ఆయన తిరిగి టీడీపీలోకి వస్తారనే ప్రచారం కూడా జరిగింది.

 

ఈ క్రమంలో పార్టీ మార్పుపై తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇచ్చారు. తాను టీఆర్ఎస్ ను వీడే ప్రసక్తే లేదని, కేసీఆర్ తోనే తన రాజకీయ జీవితం ముడిపడి ఉందని తెలిపారు. టీఆర్ఎస్‌తోనే తన రాజకీయం జీవితం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తాజాగా ములుగు జిల్లా వాజేడు సమీపంలో తన అనుచరులతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మార్పు వార్తలపై ఆయన స్పందించారు.

 

కేసీఆర్‌తోనే కలిసి నడుస్తానని, కేసీఆర్ ఆదేశాల ప్రకారం తాను నడుచుకుంటానని తుమ్మల చెప్పారు. కేసీఆర్ నుంచి ఆదేశాలు వస్తే ఏ పదవి చేపట్టడానికైనా సిద్దమని తెలిపారు. పార్టీ మారే ఉద్దేశం తనకు లేదని క్లారిటీ ఇచ్చారు. తనతో ఉండమని కేసీఆర్ చెప్పారని, ఆయన మాట ప్రకారం కేసీఆర్ వెంటే ఉంటానని స్పష్టం చేశారు.

 

దేశ రాజకీయాల్లో మార్పులు తీసుకురావాలని కేసీఆర్ చూస్తున్నారని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఏపీ కంటే తెలంగాణ బాగా అభివృద్ధి చెందిందని చెప్పారు. ఖమ్మం జిల్లాను కేసీఆర్ సస్యశ్యామలంగా మార్చారని, సీతారామ ప్రాజెక్టు కోసం కేసీఆర్ తోనే తాను కలిసి నడుస్తానంటూ తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ ఇవ్వడంతో.. గత కొంతకాలంగా ఆయన పార్టీ మారుతారంటూ జరుగుతున్న ప్రచారానికి చెక్ పడింది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -