Mahabubabad: రేపే పెళ్లి.. అంతలోనే వరుడు మృతి?

Mahabubabad: ఇటీవల కాలంలో చాలా వరకు మరణాలు ఊహించని విధంగా చోటు చేసుకుంటున్నాయి. అప్పటివరకు నవ్వుతూ అందరితో బాగా మెలుగుతున్న వారు ఊహించని విధంగా బలవుతున్నారు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో చాలామంది యుక్త వయసు వారు కళ్ళముందే హార్ట్ ఎటాక్ లేదంటే రోడ్డు ప్రమాదాలు బారినపడి మరణిస్తున్నారు. మరి ముఖ్యంగా మరో వారంలో పెళ్లి అనగా మరణిస్తున్న వధువు వరుల సంఖ్య ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉంది. తాజాగా ఒక వ్యక్తి వారంలో పెళ్లి ఉండగా ఫ్రెండ్స్ కి లగ్నపత్రికలు ఇచ్చి వస్తుండగా మృత్యువు లారీ రూపంలో అతని పైకి దూసుకు వచ్చింది.

తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. మహబూబాబాద్ జిల్లా కొమ్ముగూడెంలో తాజాగా ఈ విషాదం చోటు చేసుకుంది. తెల్లారితే పెళ్లి అప్పటికే పెళ్లి కార్డులు అన్నీ పంచేశారు. బంధువులు, స్నేహితులు అందరూ వచ్చారు. పెళ్లి పనులు పూర్తయ్యాయి బ్యాండ్, డీజేలు సిద్దంగా ఉన్నాయి. రేపటి పెళ్లి కోసం అందరూ సిద్దమవుతున్న సమయంలో కరెంటు రూపంలో పెళ్లి కొడుకును మృత్యువు కబలించింది. ఆస్పత్రికి తీసుకు వెళ్లేలోపు వరుడు కన్నుమూశాడు. దీంతో పెళ్లి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. పెళ్లి డప్పులు మోగాల్సిన చోట చావు డప్పు మోగింది.

 

కొమ్ముగూడెం గ్రామ పంచాయితీకి చెందిన యాకూబ్ అనే యువకుడు, ఇదే జిల్లా గార్ల మండలానికి చెందిన ఒక యువతితో ఇటీవల నిశ్చితార్థం అయ్యింది. పెద్దలు మే 12, శుక్రవారం అంటే నేడు వివాహ ముహూర్తం నిర్ణయించారు. పెళ్లి కూతురు ఇంటి వద్ద వివాహం జరగాల్సి ఉంది. ఇరు కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాటు పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో పెళ్లి కొడుకు యాకూబ్ తన ఇంటి వద్ద బోరు మోటర్ కు విద్యుత్ కనెక్షన్ ఇస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి గిల గిలా కొట్టుకుంటూ పడిపోయాడు. వెంటనే బంధువులు ఏరియా ఆస్పత్రికి తరలించేలోపు మార్గ మధ్యలోనే కన్నుమూశాడు. ఈ విషాదఘటనతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనతో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -