TTD Board: కోటి గోవింద నామాలు రాయడాన్ని పూర్తి చేస్తే వీఐపీ బ్రేక్ దర్శనం.. టీటీడీ నిర్ణయం మామూలుగా లేదుగా!

TTD Board: యువతలో హైందవ సనాతన ధర్మ వ్యాప్తి కోసం టీటీడీ తీసుకున్న కీలక నిర్ణయం ఇప్పుడు పలువురి ప్రశంసలు అందుకుంటుంది. అదేమిటంటే రామకోటి తరహాలో గోవింద కోటి రాసిన 25 ఏళ్ల లోపు వారికి వారి కుటుంబ సభ్యులతో కలిసి ఒకసారి తిరుమల స్వామివారి బ్రేక్ దర్శనం కల్పిస్తామని వెల్లడించారు టీటీడీ ధర్మకర్తల మండలి. విద్యార్థులకు ప్రసాదంగా కోటి భగవద్గీత పుస్తకాలు పంపిణీ చేసేందుకు నిర్ణయించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు తెలిపారు.

యువతరంలో భగవద్భక్తి దిశగా దృష్టి సాధించేందుకు తొలి అడుగు వేస్తున్నామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. అందులో భాగంగానే ఈ గోవింద కోటి రాసిన వాళ్ళకి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల స్వామివారి బ్రేక్ దర్శనం అదే 10, 1,116 సార్లు గోవింద నామం రాసిన వారికి దర్శన సౌభాగ్యం కల్పిస్తామన్నారు. సనాతన ధర్మం పట్ల మానవీయ నైతిక విలువల పట్ల అవగాహన కల్పించేందుకు ఎల్ కె జి నుంచి పీజీ వరకు చదువుతున్న..

విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా 20 పేజీల్లో భగవద్గీత సారాంశాన్ని పుస్తక ప్రసాదంగా కోటి పుస్తకాలు ముద్రించి పంపిణీ చేస్తామన్నారు. ఇంకా ఈ ధర్మకర్తల మండలి తీసుకున్న కీలక నిర్ణయాల గురించి భూమన కరుణాకర్ రెడ్డి ఈ విధంగా చెప్పారు. ఈ ఏడాది 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. 2024వ సంవత్సరం టీటీడీ క్యాలెండర్లు, డైరీలను ముఖ్యమంత్రివర్యులు విడుదల చేస్తారని చెప్పారు.

అలాగే నేరుగా వచ్చి బ్రహ్మోత్సవాలను తిలకించలేని భక్తుల సౌలభ్యం మేరకు ఉదయం, రాత్రి వాహన సేవలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. అలాగే చిరుత దాడిలో మృతి చెందిన చిన్నారి లక్షిత కుటుంబానికి టీటీడీ ద్వారా గతంలో ప్రకటించిన 5 లక్షల ఎక్స్గ్రేషన్ 10 లక్షలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు భూమన కరుణాకర్ రెడ్డి. ఈ నిర్ణయాలు విన్న సామాన్య ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అలాగే టీటీడీ నిర్ణయాలు మామూలుగా లేవు అంటూ అభినందిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: ఉప్మాకు అమ్ముడుపోవద్దంటూ పవన్ కళ్యాణ్ సెటైర్లు.. ఆ ఉప్మా ఎవరంటే?

Pawan Kalyan:  ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పవన్ కళ్యాణ్ తన ప్రచారం లో జోరు, ప్రసంగాలలో హోరు పెంచుతున్నారు. తనదైన స్టైల్ లో ప్రతిపక్షం వారిని విమర్శిస్తూ కూటమి అధికారంలోకి వస్తే...
- Advertisement -
- Advertisement -