Nara Lokesh-Murugudu Lavanya: మంగళగిరిలో సీన్ సితారే.. లోకేశ్ దెబ్బకు వైసీపీ లావణ్య సైలెంట్ అయ్యారా?

Nara Lokesh-Murugudu Lavanya: 2019 ఎన్నికలలో నారా లోకేష్ వైసీపీ నేత ఆళ్ళ రామకృష్ణారెడ్డి చేతిలో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి చాలా తక్కువ ఓట్లు తేడాతో ఓడిపోయారు. అయితే ఈసారి మాత్రం నారా లోకేష్ గెలుపు సూచనలు బాగా కనిపిస్తున్నాయి. మంగళగిరిలో ప్రతి గడపకు వెళుతున్న నారా లోకేష్ కి ప్రతి ఇంటి నుంచి ఘన స్వాగతం లభిస్తుంది. నారా లోకేష్ కూడా ఎన్నికల ప్రచారాన్ని కనీవినీ ఎరుగని రీతిలో అత్యద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఓటర్లు కూడా పూర్తిస్థాయిలో నారా లోకేష్ కి మద్దతు ఇస్తున్నారు.

గత ఎన్నికలలో నారా లోకేష్ ని ఓడించిన మనం ఈసారి ఎలాగైనా గెలిపించాలి అనే సెంటిమెంట్ మంగళగిరి నియోజకవర్గ ప్రజలలో కనిపించడం నారా లోకేష్ కి ప్లస్ పాయింట్ అవుతుంది. ఎన్నికల కోడ్ అమలులోకి రాకముందు వరకు రాష్ట్రవ్యాప్తంగా చురుకుగా పర్యటనలు చేసిన లోకేష్ కోడ్ అమలులోకి వచ్చాక కేవలం మంగళగిరి నియోజకవర్గంలో మాత్రమే ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గం లో గల్లీ గల్లీకి తిరుగుతూ గడపగడపకి తాము చేయబోయే అభివృద్ధి పనుల గురించి వివరిస్తున్నారు.

ఇదంతా కేవలం గెలవడం కోసం మాత్రమే కాకుండా రికార్డు మెజారిటీ సాధించాలనే తపన అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. గతంలో లోకేష్ కి గట్టి పోటీ ఇచ్చిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఈసారి పోటీ చేయటం లేదు. వైసీపీ మీద రకరకాల విమర్శలు చేసి ఆ పార్టీ నుంచి బయటికి వచ్చి మళ్లీ అదే పార్టీలో చేరి, అదే పార్టీని పొగుడుతూ ఉండటంతో ఓటర్ల దృష్టిలో చులకన అయిపోయారు రామకృష్ణారెడ్డి.

ఇప్పుడు వైసీపీ మురుగుడు లావణ్యని రంగంలోకి దింపింది. అయితే ఆమె ప్రచారంలో బాగా వెనకబడిపోయారు. తెదేపా మీద రాజకీయ విమర్శలు సంధించడం తప్పితే అధికారంలోకి వస్తే ఆమె ఏం చేయాలనుకుంటున్నారో అనే విషయాల గురించి అసలు ప్రస్తావించకపోవడంతో ఆమె గెలుపు అనుమానమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -