Pawan Kalyan: జగన్ మెడకు చుట్టుకుంటున్న చెల్లి చీర.. ఆ కామెంట్లు నిండా ముంచేసేలా ఉ

 Pawan Kalyan: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ నాయకుల పర్యటనలు జోరు అందుకున్నాయి. ప్రతిపక్షాల లోటుపాట్లను ఎత్తిచూపుతూ, తాము సాధించబోయే అభివృద్ధి గురించి ప్రసంగిస్తూ రాజకీయ నాయకులు బిజీబిజీగా ఉన్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలో రాజోలు నియోజకవర్గం లో పర్యటించి కూటమి అభ్యర్థుల పక్షాన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా జగన్ గురించి మాట్లాడుతూ ఆయన తన సోదరి కట్టుబొట్టు మీద మాట్లాడిన మాటలని మరొకసారి ఖండించారు పవన్ కళ్యాణ్.

ఏ అన్న అయినా చెల్లెలి కట్టుబొట్టుని విమర్శిస్తారా? పలానా బట్టలే వేసుకోవాలని నిర్దేశిస్తారు కానీ జగన్ మాత్రం సొంత చెల్లెలు కట్టుకున్న బట్టలనే విమర్శిస్తున్నారు. అలాంటి వ్యక్తి మరొకసారి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మహిళలకు ఏం రక్షణ కల్పిస్తాడు. రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారు. ఈ విషయం మీద ఒక్కసారి కూడా స్పందించని జగన్ తన సొంత చెల్లెలి చీరలపై కామెంట్లు చేస్తున్నాడు అంటూ విమర్శించారు.

కూటమి ప్రభుత్వం 18 రోజుల్లో ఏర్పడుతుందని పవన్ ధీమా వ్యక్తం చేశారు. తాను చూసిన, విన్న అన్ని సమస్యలను పరిష్కరించే బాధ్యత కూటమి తరుపున తాను తీసుకుంటున్నట్లు పవన్ తెలిపారు. జగన్ లాంటి దిగజారిపోయిన నాయకుడిని తాను ఎన్నడూ చూడలేదన్నారు. తన ఇంట్లో వాళ్ళని తిడుతున్నాడు, చంద్రబాబు భార్యను నిండు సభలో అవమానించాడు, ఇప్పుడు సొంత చెల్లిని పులివెందుల గడ్డపైనే విమర్శిస్తున్నాడని నిప్పులు చెరిగారు. వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని పవన్ కళ్యాణ్ కోరారు.

వారు ఓటమికి దగ్గరలో ఉన్నారని అందుకే కూటమిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆ ప్రచారాలను నమ్మి మహిళలు మోసపోవద్దని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఈ పద్దెనిమిది రోజులు టైం ఉంది, కూటమి అధికారంలోకి వస్తే కనుక అందరి జీవితాలు మారుతాయని చెప్పుకొచ్చారు పవన్.ఈయన రాపాక వరప్రసాద్ పైన కూడా విమర్శలు గుర్తించారు. వైసీపీ నేతలతో కలిసి అవినీతికి పాల్పడ్డారు, ఇలాంటి వాడు ఇప్పుడు పార్లమెంట్ కి వెళ్తే ప్రజాస్వామ్యం అపహాస్యం అయినట్లే అని వ్యాఖ్యానించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -